Traffic Restrictions In Cyberabad : రాహుల్ భారత్ జోడో యాత్ర.. సైబరాబాద్ పరిధిలో 4 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆదివారం సైబరాబాద్ కమిషనరేట్​పరిధిలోకి ప్రవేశిస్తుండటంతో నేటి నుంచి నాలుగు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఈ మేరకు ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

Traffic Restrictions In Cyberabad : రాహుల్ భారత్ జోడో యాత్ర.. సైబరాబాద్ పరిధిలో 4 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు

traffic restrictions in Cyberabad

Traffic Restrictions In Cyberabad : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆదివారం సైబరాబాద్ కమిషనరేట్​పరిధిలోకి ప్రవేశిస్తుండటంతో నేటి నుంచి నాలుగు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఈ మేరకు ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. షాద్​నగర్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో 30న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 7 గంటల వరకు జడ్చర్ల నుంచి సిటీ వైపు వచ్చే వెహికల్స్‌ను ఒకే లేన్‌లో అనుమతిస్తారు. మరో లేన్‌లో వచ్చే వెహికల్స్ అమిత్​కాటన్ మిల్​, బూర్గుల క్రాస్​రోడ్, రాయికల్, సోలిపూర్ మీదుగా షాద్ నగర్‌కు వెళ్లాలి.

బెంగళూరు నుంచి షాద్​నగర్​వైపు వచ్చే వాహనాలు కేశంపేట క్రాస్​ రోడ్, చటాన్​పల్లి రైల్వే గేట్​మీదుగా వెళ్లాలి. పరిగి నుంచి జడ్చర్ల వైపు వెళ్లే వాహనాలు షాద్​నగర్ క్రాస్ రోడ్, బీఎస్ఎన్ఎల్ ఆఫీసు, కేశంపేట రైల్వే గేటు మీదుగా హైవే మీదకు చేరుకోవాల్సి ఉంటుంది. సిటీ నుంచి షాద్​నగర్‌కు వెళ్లే వాహనాలు కొత్తూరు​ వై జంక్షన్​, జేపీ దర్గా క్రాస్ రోడ్, నందిగామ, దస్కల్​ క్రాస్ రోడ్, కేశంపేట క్రాస్ రోడ్ మీదుగా వెళ్లాలి. జడ్చర్ల నుంచి షాద్​నగర్​ మీదుగా సిటీ వైపు వెళ్లే వెహికల్స్​ వన్​వేలో వెళ్లాల్సి ఉంటుంది.

Bharat Jodo Yatra: తెలంగాణలో 5వ రోజు భారత్ జోడో యాత్ర ప్రారంభం

శంషాబాద్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో 31న మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 వరకు… బెంగళూరు నుంచి శంషాబాద్ వైపు వచ్చే వాహనాలను పాలమాకుల గ్రామం మీదుగా జేఐవీఏ ఆశ్రమం, గొల్లూరు క్రాస్ రోడ్, శంకరాపురం, సంగిగూడ జంక్షన్, పెద్ద గోల్కొండ టోల్ గేట్, బహదూర్​గూడ, గొల్లపల్లి, కిషన్​గూడ ఫ్లై ఓవర్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 వరకు.. బెంగళూరు నుంచి సిటీకి వచ్చే వాహనాలు తొండుపల్లి టోల్​గేట్ మీదుగా రాళ్లగూడ సర్వీస్​ రోడ్ జంక్షన్, ఎయిర్ పోర్డు కాలనీ జంక్షన్, రాజీవ్ గృహ కల్ప జంక్షన్, ఓఆర్ఆర్ అండర్​పాస్, గగన్​పహాడ్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.

బాలానగర్ ట్రాఫిక్‌‌‌‌ పీఎస్ పరిధిలో.. బోయిన్‌పల్లి నుంచి బాలానగర్​వైపు వెళ్లే వాహనాలు బోయిన్‌పల్లి జంక్షన్​, ఓల్డ్ ఎయిర్ పోర్టు, గౌతంనగర్, శోభన జంక్షన్, ఫతేనగర్ పైప్​లైన్ రోడ్ మీదుగా బాలానగర్ చేరుకోవాల్సి ఉంటుంది. బాలానగర్ నుంచి బోయిన్‌పల్లి వైపు వెళ్లే వాహనాలు సైతం ఇదే రూట్‌లో వెళ్లాలి. బోయిన్‌పల్లి నుంచి కూకట్‌పల్లి వైపు వెళ్లే వెహికల్స్ బాలానగర్ టీ–జంక్షన్ నుంచి ఫతేనగర్, జింకలవాడ, సనత్ నగర్ రైల్వే స్టేషన్, భరత్ నగర్ మార్కెట్ మీదుగా కూకట్‌పల్లి వై జంక్షన్‌కు చేరుకోవాల్సి ఉంటుంది.

Bhart jodo Yatra In Telangana: భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ, రేవంత్‌ రెడ్డిల పరుగు పందెం.. వీడియో వైరల్

బోయిన్​పల్లి, జీడిమెట్ల నుంచి కూకట్‌పల్లి వైపు వచ్చే వాహనాలు నర్సాపూర్ జంక్షన్, జింకలవాడ, సనత్ నగర్ రైల్వే స్టేషన్, భరత్ నగర్ మార్కెట్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. కూకట్‌పల్లి నుంచి బోయిన్‌పల్లి వైపు వెళ్లే వాహనాలు నర్సాపూర్ జంక్షన్, గుడెన్ మెట్ జంక్షన్, కుత్బుల్లాపూర్ వై జంక్షన్, సుచిత్రా సర్కిల్ మీదుగా వెళ్లాలి. కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, మియాపూర్ ట్రాఫిక్ పీఎస్‌ల పరిధిలో.. బాలానగర్ ​నుంచి అంబేద్కర్ వై జంక్షన్ వైపు వచ్చే వెహికల్స్ ఒకే లేన్‌లో వెళ్లేందుకు మాత్రమే అనుమతిస్తారు.

మూసాపేట నుంచి ఇక్రిశాట్ వైపు వెళ్లే వెహికల్స్‌ను వై జంక్షన్ నుంచి ఇక్రిశాట్ వరకు రెండు లేన్లలో అనుమతిస్తారు. కూకట్‌పల్లి నుంచి ఇక్రిశాట్ వైపు వెళ్లే వెహికల్స్‌ను రెండు లేన్లలో అనుమతిస్తారు. జేఎన్టీయూ నుంచి ఇక్రిశాట్ వైపు వెహికల్స్‌ను ఒకే లేన్​లో అనుమతిస్తారు. మరో 3 లేన్లలో పాదయాత్ర ఉంటుంది. వాహనదారులు ఈ ఆంక్షలను గమనించి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని సైబరాబాద్​ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావు కోరారు.