Congress Objection : హుజూరాబాద్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలపై కాంగ్రెస్ అభ్యంతరం

హుజూరాబాద్ ఉప ఎన్నికల షెడ్యూల్ పై కాంగ్రెస్ అభ్యంతరం తెలిపింది. ఈ మేరకు కాంగ్రెస్‌ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌..చీఫ్‌ ఎన్నికల కమిషనర్‌, రాష్ట్ర ఎన్నికల అధికారికి లేఖ రాశారు.

Congress Objection : హుజూరాబాద్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలపై కాంగ్రెస్ అభ్యంతరం

Congress (1)

Huzurabad by-election schedule : హుజూరాబాద్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలపై కాంగ్రెస్ అభ్యంతరం తెలిపింది. ఈవీఎం, వీవీప్యాట్‌ల మొదటి స్థాయి తనిఖీల్లో గుర్తించిన అవకతవకలను సరిదిద్దకుండా హుజూరాబాద్‌ ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ రిలీజ్ చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు మంగళవారం కాంగ్రెస్‌ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌..చీఫ్‌ ఎన్నికల కమిషనర్‌, రాష్ట్ర ఎన్నికల అధికారికి లేఖ రాశారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలపై తీవ్ర అభ్యంతరం తెలిపారు.

సెప్టెంబర్ 8న వీవీ ప్యాట్లు, ఈవీఎంల తనిఖీల్లో గుర్తించిన అవకతవకలను సరిదిద్దాలని డిమాండ్‌ చేశారు. ఆ తర్వాతే ఈవీఎం, వీవీప్యాట్‌ల మొదటి స్థాయి తనిఖీలు తిరిగి నిర్వహించాలని కోరారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేస్తూ అధికార పార్టీకి మద్దతుగా వ్యవహరించిన కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ఎన్నికల అధికారిగా ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిష్పక్షపాతంగా ప్రస్తుత జిల్లా కలెక్టర్‌ తన బాధ్యతలను నిర్వహించలేరని ఆరోపించారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నిర్వహణ కోసం మరో ఐఏఎస్‌ అధికారిని ఎన్నికల అధికారిగా నియమించాలని కోరారు.

Huzurabad By Poll Schedule : హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల

హుజూరాబాద్ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. అక్టోబర్‌ 30న ఈ రెండు నియోజక వర్గాలకు ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది. నవంబర్‌ 2న కౌంటింగ్‌ చేపట్టనున్నట్లు పేర్కొంది. అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అక్టోబర్ 8వరకు నామినేషన్ దాఖలుకు చివరి తేదీగా నిర్ణయించారు. అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 13గా ప్రకటించింది. అక్టోబర్ 30వ తేదీన ఎన్నికల నిర్వహించి…. నవంబర్ 2వ తేదీ ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను ప్రకటిస్తారు.ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా షెడ్యూల్‌ను విడుదల చేసింది.

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేయడంతో.. తన ఎమ్మెల్యే పదవికి జూన్‌ 12న ఆయన రాజీనామా చేశారు. దీంతో హుజురాబాద్‌ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల బ‌రిలో టీఆర్ఎస్ పార్టీ త‌ర‌పున విద్యార్థి నాయ‌కుడు గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ పోటీ చేస్తున్నారు. రాజీనామా చేసిన ఈటల రాజేందర్ బీజేపీ తరుఫున పోటీ చేస్తున్నారు.

Huzurabad : హుజూరాబాద్ ఉప ఎన్నికలు..రోడ్ షోలు, బైక్-సైకిల్ ర్యాలీలకు అనుమతి లేదు

హుజూరాబాద్ కాంగ్రెస్ షార్ట్ లిస్ట్ లో కొత్త పేర్లు చేరాయి. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ్మ కమిటీ అభ్యర్థి ఎంపికపై కసరత్తు పూర్తి చేసింది. అధిష్టానానికి పంపిని నివేదికలో నలుగురి పేర్లను పేర్కొన్నారు. కృష్ణారెడ్డి, రవికుమార్(మున్నూరు కాపు), సైదులు (ఎస్సీ), ప్యాట రమేశ్ (మున్నూరు కాపు) పేర్లు ఉన్నాయి. కాంగ్రెస్ ఎల్లుండి హుజూరాబాద్ అభ్యర్థిని ప్రకటించనుంది.