Corona Infect : ఆ రెండు బ్లడ్ గ్రూపుల వారికి కరోనా త్వరగా సోకుతుంది..

AB లేదా B పాజిటివ్‌ బ్లడ్ గ్రూపుల వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ద కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ సూచించింది.

Corona Infect : ఆ రెండు బ్లడ్ గ్రూపుల వారికి కరోనా త్వరగా సోకుతుంది..

Corona Can Infect People With Ab B Blood Group Quickly

Corona infect : AB లేదా B పాజిటివ్‌ బ్లడ్ గ్రూపుల వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ద కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ సూచించింది. ఈ రెండు గ్రూపుల వారికి ఎక్కువగా కొవిడ్‌ సోకుతున్న విషయాన్ని గుర్తించింది. AB, B బ్లడ్‌ గ్రూపున్న వారిలో ఎక్కువ మందికి కరోనా త్వరగా సోకుతుందని సీఎస్‌ఐఆర్‌ తెలిపింది.



మరోవైపు దేశంలో క‌రోనా ఉధృతి స్వల్పంగా త‌గ్గింది. నిన్నటితో పోల్చితే సుమారు 40 వేల కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా 3 లక్షల 29 వేల 519 మందికి కరోనా సోకింది. కానీ మరణాలు నిన్నటి కంటే ఎక్కువే నమోదయ్యాయి. 24 గంటల్లో 3 వేల 879 మంది కరోనాకు బలయ్యారు.



గ‌త నాలుగు రోజులుగా ప్రతిరోజూ నాలుగు ల‌క్షల‌కుపైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ ప‌రంప‌ర‌కు కాస్తా బ్రేక్ ప‌డింది. కరోనా నుంచి రికవరీ అవుతున్న బాధితుల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతుండటం ఊరటనిచ్చే అంశం.