Corona Second Wave : కరోనాకు ధైర్యమే మందు, స్వీయనియంత్రణే రక్షణ – ఈటెల

కరోనా వైరస్ సోకకగానే..భయ పడొద్దని, ధైర్యమే మందు..అని స్వీయనియంత్రణే రక్షణ అని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రజలకు సూచించారు.

Corona Second Wave : కరోనాకు ధైర్యమే మందు, స్వీయనియంత్రణే రక్షణ – ఈటెల

second wave of corona

Minister Etela Rajender : కరోనా వైరస్ సోకకగానే..భయ పడొద్దని, ధైర్యమే మందు..అని స్వీయనియంత్రణే రక్షణ అని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రజలకు సూచించారు. కరోనా సెకండ్ వేవ్ చాలా ఉధృతంగా ఉందని, ప్రస్తుతం తెలంగాణలో ఆక్సిజన్ కొరత లేదన్నారు. అవసరం అయితే..తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని తెలిపారు. సెకండ్ వేవ్ ఇంత వేగంగా విస్తరిస్తుందని ఊహించలేదని, వ్యాక్సిన్ వేసుకోవాలని, కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని సూచిస్తే..ఎవరూ ఆ పని చేయలేదన్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ ఏ విధంగా ఉంది ? ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తదితర వివరాల గురించి మంత్రి ఈటెలతో 10tv ముచ్చటించింది.

ఎవరూ భయపడవద్దని, వదంతులతో బెంబేలెత్తవద్దని సూచిస్తున్నామన్నారు. ధైర్యమే మందు..తర్వాతి మందు ఆక్సిజన్ లాంటిదన్నారు. పని చేసే క్రమంలో..మాస్క్ లు తదితర వాటిని తప్పకుండా పాటించాలని స్వీయనియంత్రణే రక్షణ అని మరోసారి స్పష్టం చేశారాయన. ప్రభుత్వం నుంచి సహకారం తప్పకుండా అందిస్తున్నామన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా వైరస్ విస్తరించలేదని, పట్టణాల్లో మాత్రమే కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందన్నారు. కరోనా వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలను ప్రభుత్వం తీసుకొంటోందని, ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పది వేల బెడ్స్ కు వెంటిలేటర్లు, ఆక్సిజన్ పెట్టడం జరిగిందని, మహారాష్ట్రలో పెరుగుతున్న కేసుల దృష్ట్యా..ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన రోగులు వాలిపోతున్నట్లు తెలిపారు.

ఐదు శాతం మంది కేసులు మాత్రమే ఆసుపత్రులకు వస్తున్నాయని, ఒబెసిటీ, వయస్సు దాటిన వారు..మరికొంతమంది మృతి చెందుతున్నారని, కోవిడ్ తో చనిపోతున్న వారి సంఖ్య ఎంత ? ఇతర వ్యాధులతో చనిపోతున్న వారి లెక్క తీసి వాస్తవ విషయాలు చెబుతున్నామన్నారు. నైట్ కర్ఫ్యూ కంటే ముందే..ఇళ్లలోకి పరిమితం కావాలని మరోసారి సూచిస్తున్నట్లు తెలిపారు. ముందు ముందు ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమౌతాయో చెప్పలేమని, తాను దేవుడిని కాదన్నారు మంత్రి ఈటెల.

Read More : పొదల్లో కనిపించే ఈ ఆకు.. కరోనాకు దివ్యౌషధం అంట..