కరోనా భయం : సోషల్ డిస్టెన్స్..కల్లు ఎలా తాగుతున్నాడో చూడండి

  • Published By: madhu ,Published On : March 29, 2020 / 04:17 AM IST
కరోనా భయం : సోషల్ డిస్టెన్స్..కల్లు ఎలా తాగుతున్నాడో చూడండి

ఎవరైనా దగ్గినా..తుమ్మినా..అమాంతం దూరం జరుగుతున్నారు. అతడిని అదో విధంగా చూస్తున్నారు. దగ్గరగా ఎవరైనా వస్తే..చాలు..ఠక్కున దూరం జరిగిపోతున్నారు. బాబు దూరం జరగండి..దగ్గరకు రాకండి..మూతి, ముక్కుకు మాస్క్ ధరించి రావాలని సూచిస్తున్నారు. అవును ప్రస్తుతం ఈ ఫీవర్ నెలకొంది. ఎందుకంటే..కరోనా వైరస్ భూతానికి జనాలు హఢలిపోతున్నారు. ఎక్కడ చూసినా ఇదే చర్చ. ప్రపంచాన్ని షేక్ చేస్తున్న ఈ వైరస్..వేలాది మందిని బలి తీసుకొంటోంది. దీనికి మందు లేదని..ముందు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. 

భారతదేశంలో కూడా కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రజలు బయటకు రాకుండా ఉండేందుకు లాక్ డౌన్ విధించింది. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇదే విధంగా ప్రకటించాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. రవాణా వ్యవస్థ మొత్తం నిలిచిపోయింది. ప్రతి రంగంపై ప్రభావం చూపిస్తోంది. నిత్యావసర సరుకులు, అత్యవసర వస్తువులు మినహా..మిగతావన్నీ క్లోజ్ అయ్యాయి. 

కానీ..రోజు కష్టం చేసుకుని..ఇంటికి వచ్చి ఇంత చుక్క మందు వేసుకునే వారు..ఇప్పుడు అష్టకష్టాలు పడుతున్నారు. వైన్స్ షాపులు ఆల్ రెడీ బంద్ అయ్యాయి. దీంతో మందుబాబుల కష్టాలు చెప్పనవసరం లేదు. పలువురు కల్లు వైపు చూస్తున్నారు. తాటి చెట్ల కిందకు చేరుతున్నారు. ఇక్కడ కూడా సామాజిక దూరం పాటించాలంటున్నారు గీత కార్మికులు.  

మిగతా వాళ్ల సంగతి ఏమో గాని..ఇక్కడ మాత్రం పక్కాగా కండీషన్స్ పాటిస్తున్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా నల్లబెల్లి మండలంలోని శనిగరం గ్రామ శివారులో తాటి చెట్టు వద్ద జరిగిన ఓ సీన్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. చెట్ల వద్దకు చేరుకున్న కల్లు ప్రియులు సోషల్ డిస్టెన్స్ పాటించాలని కార్మికులు సూచించారు.

ఇది పాటిస్తాం..సరే..కల్లు ఎలా పోస్తావ్..అని ప్రశ్నించారు. వెంటనే ఒ పొడుగాటి పైపు చూపెట్టాడు. దూరంగా కూర్చొవాలని చెప్పాడు. వారు చెప్పినట్లుగానే చేశారు. పైపును నోట్లో పెట్టుకోగానే..అవతలి నుంచి కల్లు పోశాడు. తనివితీరా తాగి..బ్రేవ్ అంటూ వెళ్లిపోతున్నారు. అదండి సంగతి…