Covid Vaccine : ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు వ్యాక్సినేషన్

గ్రేటర్ హైదరాబాధ్ ఆర్టీసీ కార్మికులకు వ్యాక్సిన్ వేయాలని నిర్ణయం తీసుకుంది. 2021, మే 30వ తేదీ ఆదివారం నుంచి టీకా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది...

Covid Vaccine : ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు వ్యాక్సినేషన్

Tsrtc

TSRTC Covid Vaccine : తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. ఇప్పటికే పలువురికి వ్యాక్సిన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే..ప్రజల్లో తిరుగుతున్న వారికి వ్యాక్సిన్ వేయాలని భావించింది. సూపర్‌ స్ప్రెడర్లుగా భావించి..వీరందరికీ వీలైనంత త్వరగా వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించింది. డ్రైవర్లు, వీధి వ్యాపారులు, గ్యాస్‌ డెలివరీ బాయ్స్‌, బ్యాంకు ఉద్యోగులు, పెట్రోల్‌ బంకుల్లో పని చేసే వారు, ఊరూరు తిరుగుతూ వ్యాపారం చేసే వారినంతా సూపర్‌ స్ప్రెడర్లుగా భావించి వీరికి టీకా వేయడానికి రెడీ అయ్యింది తెలంగాణ సర్కార్‌. కానీ..ఆర్టీసీ డ్రైవర్ల, కండక్టర్ల విషయంలో సందిగ్ధత నెలకొంది.

గ్రేటర్ హైదరాబాధ్ ఆర్టీసీ కార్మికులకు కూడా వ్యాక్సిన్ వేయాలని నిర్ణయం తీసుకుంది. 2021, మే 30వ తేదీ ఆదివారం నుంచి టీకా ఇవ్వాలని..ఇది మూడు రోజుల పాటు కొనసాగనుందని తెలుస్తోంది. సూపర్ స్ప్రెడర్లలో భాగంగా..ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు వ్యాక్సినేషన్ ఇవ్వనుందని, హైదరాబాద్ ఎంజీబీఎస్ లో ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. 5 డిపోల వారికి వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారని ఆర్టీసీ ఎండీ ముని శేఖర్ వెల్లడించారు. జిల్లాల్లో ఆర్టీసీ సిబ్బందికి వ్యాక్సినేషన్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

తెలంగాణలో ప్రస్తుతం ఉదయం 10 నుంచి మరుసటి రోజు ఉదయం 6గంటల వరకు లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఉన్న నాలుగు గంటల్లో ఆర్టీసీ బస్సులను సిబ్బంది తిప్పుతున్నారు. తమకు కూడా వ్యాక్సినేషన్ ఇవ్వాలని వారు కోరారు. మొత్తంగా రాష్ట్రంలో సూపర్‌ స్ప్రెడర్లు 25 లక్షల మందికి పైగా ఉంటారని ప్రభుత్వం అంచనా వేసింది.

Read More : Domestic Air Travel: అమాంతం పెరిగిన దేశీయ విమాన ఛార్జీలు