రాజధానిలో బస్సులు,ఆటోలకు అనుమతి

  • Published By: venkaiahnaidu ,Published On : May 18, 2020 / 02:24 PM IST
రాజధానిలో బస్సులు,ఆటోలకు అనుమతి

సరి-బేసి పద్దతిలో ఢిల్లీలో షాపింగ్ కాంప్లెక్స్ లను తిరిగి తెరిచేందుకు సీఎం కేజ్రీవాల్ ఓకే చెప్పారు. దేశరాజధానిలో మే 31 వరకు పొడిగించబడిన లాక్‌డౌన్‌ 4.0 వివరాలను ఇవాళ కేజ్రీవాల్ ప్రకటించారు. కొన్ని షరతులతో దేశ రాజధానిలో బస్సులు,ఆటోలు తిరిగేందుకు కేజ్రీవాల్ ఓకే చెప్పారు. సెలూన్లు తప్ప మిగతా స్వతంత్ర షాపులను తెరిచేందుకు అనుమతిచ్చినట్లు కేజ్రీవాల్ చెప్పారు.

కొన్నాళ్లపాటు సెలూన్ షాపులు మూసివేయబడే ఉంటాయన్నారు. ఆర్థిక కార్యకలాపాలను క్రమంగా ప్రారంభించే దిశగా పయనించాలని, వ్యాక్సిన్ వచ్చేవరకు వైరస్ కథ ముగియదని, కరోనా వైరస్ తో జీవించడం నేర్చుకోవలసి ఉంటుందని కేజ్రీవాల్ అన్నారు. మాస్క్ లు మరియు భౌతికదూరం మాత్రం ఢిల్లీలో తప్పనిసరి అని ఆయన అన్నారు. భారతదేశంలో అత్యధిక కొరోనా వైరస్ కేసులు ఉన్న రాష్ట్రాలలో ఢిల్లీ ఒకటన్న విషయం తెలిసిందే. ఢిల్లీ కరోనా కేసుల 10వేలు దాటిన విషయం తెలిసిందే.

కరోనా వైరస్ భారత్ లో ప్రవేశించిన సమయంలో మనం సిద్దంగా లేమని,ఎలా సిద్దంగా ఉండాలో మనకు తెలియలేదని అన్నారు. గడిచిన ఒకటిన్నర నెలలో ప్రత్యేక హాస్పిటల్స్,టెస్టింగ్ కిట్స్,వెంటిలేటర్ల కోసం ప్రత్యేక ప్రొవిజన్స్ తయారుచేసినట్లు కేజ్రీవాల్ తెలిపారు. అయితే సడలింపులకు కంటైన్మెంట్ జోన్లకు లేదా కరోనా ప్రభావం అధికంగా ఉన్న ఏరియాలకు వర్తించవని ఆయన సృష్టం చేశారు. ప్రస్తుతానికి మెట్రోల రైళ్లు,స్కూళ్లు,కాలేజీలు,మాల్స్,సినిమా థియేటర్స్ మూసివేయబడే ఉంటాయని ఆప్ అధినేత తెలిపారు.

ఢిల్లీ అనుమతించేవి మరియు అనుమతించనివి
-ట్యాక్సీలు,క్యాబ్ లు ఇద్దరు ప్రయాణికుతో తిరిగేందుకు అనుమతి, నలుగురు ప్రయాణికులతో మాక్సి-క్యాబ్స్ కి అనుమతి
-ప్రతీ రైడ్ లో వాహనాన్ని వైరస్ క్రిములు చేరకుండా చూసే బాధ్యత డ్రైవర్లదే
-ఇద్దరు ప్యాసింజర్లతో కార్లు తిరుగవచ్చు. టూవీలర్ పై ఒక్కరికే అనుమతి
-కార్ పూలింగ్ మరియు షేరింగ్ కు అనుమతి లేదు
-20మంది ప్రయాణికులతో మాత్రమే తిరిగేందకు బస్సులకు అనుమతి,బస్సు ఎక్కేముందు ప్రయాణికులను స్క్రీనింగ్ చేస్తారు.
-ప్రభుత్వ,ప్రేవేట్ ఆఫీసులు తెరుచుకునేందుకు అనుమతి
-సమాయాల్లో మార్పులతో సరి-బేసి విధానంలో మార్కెట్లు తెరిచేందుకు అనుమతి
-అన్ని స్వతంత్ర షాపులు తెరుచుకోవచ్చు
-కేవలం హోం డెలివరీ కోసం మాత్రమే రెస్టారెంట్లు తెరుచుకోవచ్చు
-నిర్మాణరంగ కార్యకలాపాలకు అనుమతి కానీ ఇతర ప్రాంతాల నుంచి వర్కర్లు వచ్చేందుకు అనుమతి లేదు
-50మందితో పెళ్లిళ్లు చేసుకోవచ్చు
-20మందితో మాత్రమే అంత్యక్రియలు జరగాలి
-హోటళ్లు,షాపింగ్ మాల్స్,సినిమా థియేటర్లు,జిమ్ లు,స్విమ్మింగ్ పూల్స్,ఎంటర్ టైన్ మెంట్ పార్క్ లు,బార్లు,ఆడిటోరియమ్స్,అసెంబ్లీ హాల్స్ యథావిధిగా మూసివేయడి ఉంటాయి
-సోషల్,పొలిటికల్,స్పోర్ట్స్, ఎంటర్ టైన్మెంట్,అకడమిక్చకల్చరల్ అండ్ రిలీజియస్ గేథరింగ్స్ కు అనుమతి లేదు
-సెలూన్ షాపులకు,బార్బర్లకు,స్పా సెంటర్లుకు అనుమతి లేదు
-సాయంత్రం 7గంటల నుంచి ఉదయం 7గంటల వరకు యధావిధిగా కర్ఫ్యూ ఉంటుంది
-ఆటో, ఈ-రిక్షా, సైకిల్ రిక్షాలో ఒకరికి మించి ప్రయాణికులను ఎక్కించుకోకూడదు
-10ఏళ్ల వయస్సు లోపు వాళ్లు,65ఏళ్ల వయస్సు పైబడిన వారు,గర్భిణీ లు,ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు ఇళ్లల్లోనే ఉండాలి.