MLC Kavitha : ఢిల్లీకి కవిత.. లిక్కర్ స్కామ్‌లో రేపు ఈడీ విచారణ, హాజరవుతారా? లేదా?
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఢిల్లీ బయలుదేరారు. బేంగపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. కవితతో పాటు మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కూడా ఢిల్లీకి వెళ్లారు.(MLC Kavitha)

MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఢిల్లీ బయలుదేరారు. బేంగపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. కవితతో పాటు ఆమె సోదరుడు, మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కూడా ఢిల్లీకి వెళ్లారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో మార్చి 20న విచారణకు రావాలని ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) కవితకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె ఈడీ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంది. కవిత ఈడీ ముందు విచారణకు హాజరుకావడం ఇది రెండోసారి. రేపు ఈడీ విచారణ ఉండటంతో.. కవిత ఇవాళే ఢిల్లీ బయలుదేరారు.(MLC Kavitha)
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారిస్తోంది. ఇప్పటికే ఓసారి కవితను ఈడీ ప్రశ్నించింది. ఈ నెల 20న మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. సోమవారం ఈడీ విచారణ నేపథ్యంలో అందుబాటులో ఉండే విధంగా కవిత ఢిల్లీకి వెళ్లారు. మరోవైపు ఈడీ మహిళల విచారణపై కవిత సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. మహిళను ఈడీ కార్యాలయంలో విచారించడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Also Read..MLC Kavitha : కవిత పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఈడీ కేవియట్ పిటిషన్
ఈ పిటిషన్ పై 24న విచారణ జరుపుతామని ఇదివరకే సుప్రీంకోర్టు తెలిపింది. ఈడీ.. మహిళలను విచారించే తీరుని, మహిళల పట్ల అనుసరిస్తున్న విధానాన్ని తప్పుపడుతూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ముందస్తు అరెస్టులు, ఇతర కఠిన నిర్ణయాలు ఏవీ దర్యాఫ్తు సంస్థ ఈడీ తీసుకోకుండా.. ఈ నోటీసులను నిలుపుదల చేసే విధంగా చూడాలని చెప్పి తన పిటిషన్ లో కోరారు కవిత. దీనిపై 24న విచారణ ఉన్న నేపథ్యంలో.. ఢిల్లీకి బయలుదేరినప్పటికీ.. కవిత ఈడీ విచారణకు హాజరవుతారా? లేదా? అన్నది ఉత్కంఠ రేపుతోంది. రేపటి ఈడీ విచారణకు ఆమె వ్యక్తిగతంగా హాజరవుతారా? లేక తన న్యాయవాదిని పంపిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు కవిత పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణపై ఈడీ కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. తమ వాదనలు సైతం వినాలని సుప్రీంకోర్టుని కోరింది. కవిత పిటిషన్ పైన సుప్రీంకోర్టు ముందస్తు ఉత్తర్వులు ఇచ్చే ముందు తమ వాదనలను కూడా పరిగణలోకి తీసుకోవాలని ఈడీ సైతం సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఆసక్తికరంగా మారింది.(MLC Kavitha)
ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో ఈ నెల 11న కవిత ఈడీ విచారణకు హాజరయ్యారు. 16న మరోసారి విచారణకు రావాలని కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులు ఇచ్చాక.. 14న కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. తన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నందున, మార్చి 24వరకు తనకు గడువు ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత.. ఈడీని కోరడం జరిగింది. అయినప్పటికీ కవిత అభ్యర్థనను ఈడీ పరిగణలోకి తీసుకోలేదు. మళ్లీ మార్చి 20న నోటీసులు ఇచ్చింది.(MLC kavitha)
Also Read..MLC Kavitha : లిక్కర్ స్కామ్ తో నాకు సంబంధం లేదు-తేల్చి చెప్పిన కవిత
ఇక, కవిత ఈడీ విచారణ తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచింది. బీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సీఎం కేసీఆర్ టార్గెట్ గా బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. కవితను కాపాడుకునేందుకు సీఎం కేసీఆర్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.(MLC Kavitha)