BRS-BJP poster war: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ వేళ.. హైదరాబాద్ లో పోస్టర్ వార్
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత ఇవాళ ఈడీ విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో హైదరాబాద్ లో బీఆర్ఎస్-బీజేపీ మధ్య పోస్టర్ వార్ కొనసాగుతోంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ పోస్టర్లను పలు ప్రాంతాల్లో అంటించి, 'క్రిమినల్', 'వాంటెడ్'గా పేర్కొన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలులో సిద్ధహస్తుడు అంటూ అందులో రాసుకొచ్చారు.

BRS-BJP poster war: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత ఇవాళ ఈడీ విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో హైదరాబాద్ లో బీఆర్ఎస్-బీజేపీ మధ్య పోస్టర్ వార్ కొనసాగుతోంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ పోస్టర్లను పలు ప్రాంతాల్లో అంటించి, ‘క్రిమినల్’, ‘వాంటెడ్’గా పేర్కొన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలులో సిద్ధహస్తుడు అంటూ అందులో రాసుకొచ్చారు.
ఆయన ఆచూకీ చెప్పిన వారికి.. ‘మోదీ హామీ ఇచ్చిన రూ.15 లక్షలను బహుమానంగా దక్కుతాయి’ అంటూ పేర్కొన్నారు. ఇటీవల కవిత ఢిల్లీలో ఈడీ ఎదుట విచారణకు హాజరైన నేపథ్యంలోనూ హైదరాబాద్ లో ఇటువంటి పలు పోస్టర్లు కనపడిన విషయం తెలిసిందే. ఇవాళ మరోసారి ఈడీ ఎదుట కవిత హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఆమె నిన్న ఢిల్లీకి వెళ్లి, తుగ్లక్ రోడ్డులోని సీఎం కేసీఆర్ నివాసంలో ఉన్నారు.
ఇవాళ ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయానికి వెళ్తారు. కవితకు మద్దతుగా ఇప్పటికే తెలంగాణ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు సహా సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మరి కొందరు టీఆర్ఎస్ నేతలు కూడా ఢిల్లీ వెళ్లారు. అంతేగార, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఎంపీలంతా కూడా ఢిల్లీలో ఉన్నారు.