DSPs Transfer : తెలంగాణలో 16 మంది డీఎస్పీలు బదిలీ

తెలంగాణలో 16 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

DSPs Transfer : తెలంగాణలో 16 మంది డీఎస్పీలు బదిలీ

DSPs

DSPs Transfer : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 16 మంది డీఎస్పీలు బదిలీ చేసింది. డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ బదిలీ అవ్వగా ఆయన స్థానంలో ఏసీపీగా శ్రీధర్ ను నియమించారు.

జూబ్లీహిల్స్ ఏసీపీగా సుబ్బయ్య, సైఫాబాద్ ఏసీపీగా సంజయ్ కుమార్, యాదాద్రి ఏసీపీగా నరసింహారెడ్డి, యాదగిరిగుట్ట ట్రాఫిక్ ఏసీపీగా సైదులును నియమించారు.

66 policemens transfer : ఒకే స్టేషన్ నుంచి 66మంది పోలీసులను బదిలీ చేసిన ప్రభుత్వం..ఎందుకంటే..

అలాగే వరంగల్ ఏసీపీగా బోనాల కిషన్, సత్తుపల్లి ఏసీపీగా బొజ్జ రామానుజం, మేడ్చల్ ట్రాఫిక్ ఏసీపీగా కె.వెంకట్ రెడ్డి, నిజామాబాద్ ఏసీపీగా కిరణ్ కుమార్, ఎల్ బీ నగర్ ట్రాఫిక్ ఏసీపీగా హరికృష్ణ, బెల్లంపల్లి ఏసీపీగా సైదయ్య నియామకం అయ్యారు.