Telangana Covid Cases : ఖమ్మం జిల్లాలో అత్యధిక కరోనా కేసులు నమోదు

సోమవారంతో పోల్చుకుంటే మంగళవారం తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 767 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్క రోజులో 3 గురు చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 10 వేల 064 యాక్టివ్ కేసులుండగా..3 వేల 738 మంది మృతి చెందారు.

Telangana Covid Cases : ఖమ్మం జిల్లాలో అత్యధిక కరోనా కేసులు నమోదు

Telangana Covid Cases (3)

Telangana Covid Cases : సోమవారంతో పోల్చుకుంటే మంగళవారం తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 767 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్క రోజులో 3 గురు చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 10 వేల 064 యాక్టివ్ కేసులుండగా..3 వేల 738 మంది మృతి చెందారు.

జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 77 కరోనా కేసులు బయటపడ్డాయి. కాగా గత రెండు రోజులుగా ఖమ్మం జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరిగింది. గ్రేటర్ హైదరాబాద్ లో నమోదవుతున్న కేసుల కంటే ఖమ్మం జిల్లాలో ఎక్కువగా నమోదవుతున్నాయి. మంగళవారం ఇక్కడ 84 కేసులు వెలుగుచూశాయి. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని..848 మంది డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 6 లక్షల 19 వేల 344.

ఏ జిల్లాలో ఎన్ని కేసులు : –

ఆదిలాబాద్ 04. భద్రాద్రి కొత్తగూడెం 34. జీహెచ్ఎంసీ 77. జగిత్యాల 17. జనగామ 07. జయశంకర్ భూపాలపల్లి 14. జోగులాంబ గద్వాల 01. కామారెడ్డి 04. కరీంనగర్ 51. ఖమ్మం 84. కొమరం భీం ఆసిఫాబాద్ 03. మహబూబ్ నగర్ 06. మహబూబాబాద్ 20. మంచిర్యాల 65. మెదక్ 03. మేడ్చల్ మల్కాజ్ గిరి 26. ములుగు 18.

నాగర్ కర్నూలు 06. నల్గొండ 52. నారాయణపేట 02. నిర్మల్ 03. నిజామాబాద్ 05. పెద్దపల్లి 59. రాజన్న సిరిసిల్ల 17. రంగారెడ్డి 42. సంగారెడ్డి 09. సిద్దిపేట 19. సూర్యాపేట 29. వికారాబాద్ 03. వనపర్తి 04. వరంగల్ రూరల్ 17. వరంగల్ అర్బన్ 49. యాదాద్రి భువనగిరి 17. మొత్తం 767.