Eetala Rajendar: హుజూరాబాద్ ప్రజలకు నా గెలుపు అంకితం! | eetala rajendar on huzurabad victory

Eetala Rajendar: హుజూరాబాద్ ప్రజలకు నా గెలుపు అంకితం!

హుజూరాబాద్ లో గెలుపుపై.. ఈటల రాజేందర్ హర్షం వ్యక్తం చేశారు. ఇది తన గెలుపు కాదని.. హుజూరాబాద్ ప్రజల విజయమని అన్నారు.

Eetala Rajendar: హుజూరాబాద్ ప్రజలకు నా గెలుపు అంకితం!

Eetala Rajendar: హుజూరాబాద్ లో గెలుపుపై.. ఈటల రాజేందర్ హర్షం వ్యక్తం చేశారు. ఇది తన గెలుపు కాదని.. హుజూరాబాద్ ప్రజల విజయమని అన్నారు. తన గెలుపునకు.. బీజేపీ నేతలంతా శ్రమించారంటూ.. వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. తన భార్య, కుటుంబ సభ్యులు కూడా పనులన్నీ పక్కనబెట్టి ఓటర్లను కలిసి అభ్యర్థించారని చెప్పారు.

అధికార పార్టీ నేతలు ఎంత ప్రయత్నించినా.. తన గెలుపును అడ్డుకోలేకపోయారని చెప్పారు. ప్రజలంతా తనను కాపాడుకుంటామని అన్నారన్నారు. టీఆర్ఎస్ నేతలు ఎన్ని సార్లు డబ్బులు ఇచ్చినా.. ఈటలకే ఓటు వేస్తామని అన్నట్టు చెప్పారు. కొందరు తన గెలుపు కోసం సీక్రెట్ గా సపోర్ట్ చేశారని.. వాళ్ల పేర్లు మాత్రం చెప్పనని ఈటల కామెంట్ చేశారు.

తనంతట తానుగా టీఆర్ఎస్ నుంచి బయటకు రాలేదని.. తనను వెళ్లగొట్టారని ఈటల అన్నారు. తాను ఇంత వరకూ తప్పు చేయలేదని.. ఇకపై చేయబోనని.. ఎప్పటికైనా ప్రజల నోట్లో నాలుకలా ఉంటానని.. ఏ పదవి వచ్చినా వన్నె తెచ్చే నాయకుడిని తాను అని ఈటల చెప్పారు. తెలంగాణ బిల్లు పాసైనప్పుడు తన జీవితం ఓ సారి ధన్యమైందని.. ఇప్పుడు మరోసారి అదే అనుభూతి కలుగుతోందని ఈటల రాజేందర్ చెప్పారు.

ఈ మొత్తం విజయాన్ని హుజూరాబాద్ ప్రజలకే అంకితం చేస్తానని.. తన ఓటర్లను కంటికి రెప్పలా కాపాడుతానని ఈటల చెప్పారు. తనను ప్రజలంతా నిండు మనసుతో ఆశీర్వదించారని.. వారందరికీ కృతజ్ఞతలనీ అన్నారు.

Read More:

ఈటల ఘన విజయం_ BJP Etala Rajender Won In Huzurabad By-poll

ఈటల గెలుపుపై హరీష్ రావు స్పందన _ Harish Rao Reaction On Huzurabad Bypoll Results

Huzurabad By Poll : అణచివేతపై రేపటినుంచే నా పోరాటం; ఈటల

Huzurabad Bypoll Result: ఈటల ఎలా గెలిచారు? దళితబంధు ప్రారంభించిన గ్రామంలోనూ బీజేపీదే హవా!

Huzurabad : ఈటల మెజారిటీ ఎంతో తెలుసా? రౌండ్ వారీగా ఓట్ల వివరాలు

Huzurabad By Poll : ఓటమిపై స్పందించిన కేటీఆర్.. 20 ఏళ్లలో ఇలాంటివి ఎన్నో చూసాం

×