Huzurabad By Poll : అణచివేతపై రేపటినుంచే నా పోరాటం – ఈటల

గెలుపు అనంతరం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు.. తనను అత్యధిక మెజారితో గెలిపించిన హుజూరాబాద్ ప్రజలకు ఈటల కృతఙ్ఞతలు తెలిపారు.

Huzurabad By Poll : అణచివేతపై రేపటినుంచే నా పోరాటం – ఈటల

Huzurabad By Poll (3)

Huzurabad By Poll :  హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ఈటల రాజేందర్ 24, 068 మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనుపై విజయం సాధించారు. ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికల్లో అంతిమ విజయం ఈటలను వరించింది. బ్యాలెట్ ఓట్లలో మెజారిటీ సాధించిన టీఆర్ఎస్ ఆ తర్వాత వెనకబడింది.

వరుసగా ఏడు రౌండ్లలో బీజేపీ ఆధిక్యం కనబరిచగా 8వ రౌండ్ లో టీఆర్ఎస్ ఆధిక్యం కనబరిచింది.. ఆ తర్వాత 11వ రౌండ్లో టీఆర్ఎస్ ఆధిక్యం చూపింది.. ఆ తర్వాత 22 రౌండ్ వరకు బీజేపీనే ఆధిక్యంలో కొనసాగింది. 22 రౌండ్లలో కేవలం రెండు రౌండ్లలో మాత్రమే టీఆర్ఎస్ ఆధిక్యం చూపింది.

చదవండి : Huzurabad : ఈటల మెజారిటీ ఎంతో తెలుసా…? రౌండ్ వారీగా ఓట్ల వివరాలు

ఇక గెలుపు అనంతరం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు.. తనను అత్యధిక మెజారితో గెలిపించిన హుజూరాబాద్ ప్రజలకు ఈటల కృతఙ్ఞతలు తెలిపారు. హుజూరాబాద్ ప్రజలకు తన గెలుపును అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు రాజేందర్.. హుజూరాబాద్ ప్రజానీకానికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాన్నారు. తన గెలుపుకోసం పనిచేసిన ప్రతిఒక్క కార్యకర్తకు, నాయకులకు కృతఙ్ఞతలు తెలిపారు.

చదవండి : Huzurabad By Poll : ఓటమిపై స్పందించిన కేటీఆర్.. 20 ఏళ్లలో ఇలాంటివి ఎన్నో చూసాం

ఐదు అంశాలపై పోరాటం

దళిత బంధును హుజూరాబాద్‌లో పూర్తి స్థాయిలో అమలు చేయాలనీ
దళిత బంధును తెలంగాణ వ్యాప్తంగా ఇవ్వాలని డిమాండ్
పేదరికంతో బ్రతికే ప్రతిఒక్కరికి కులంతో పనిలేకుండా దళిత బంధు వంటి అవకాశం కల్పించాలి
సొంత జాగాల్లో డబల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇవాళ్లని డిమాండ్
ఉద్యోగ నోటిఫికేషన్ల వెయ్యాలని డిమాండ్

పై ఐదు అంశాలపై రేపటి నుంచే తన పోరాటం మొదలు పెడతానని ఈటల రాజేందర్ తెలిపారు. పేద ప్రజలకు అండగా ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుక అవుతా అన్నారు ఈటల.