నాకు సంతోషమే.. మంత్రి పదవి తొలగింపుపై ఈటల రియాక్షన్

నాకు సంతోషమే.. మంత్రి పదవి తొలగింపుపై ఈటల రియాక్షన్

Etela

Etela Rajender: తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ నుంచి తొలగించడంపై స్పందించారు ఈటల రాజేందర్. సర్వాధికారాలు సీఎంకు ఉంటాయని స్పష్టంచేశారు ఈటల రాజేందర్. తర్వాత ఏం చెయ్యాలి అనేదానిపై నా అనుచరులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని అన్నారు ఈటల. నా శాఖను సీఎంకు బదిలీ చేసినట్లు తెలిసింది.. సంతోషం.. అని అన్నారు.

కొన్నిరోజులుగా ఈటలకు సరైన ప్రాధాన్యత దక్కలేదు అని వార్తలు రాగా.. తనకున్న వైద్య ఆరోగ్యశాఖను తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడంపై ప్రణాళికాబద్ధంగా పరిణామాలు జరుగుతున్నాయని వైద్యఆరోగ్యశాఖ ద్వారా ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఆకాంక్షించారు ఈటల. ప్రజలకు మెరుగైన వైద్యం అందాలని అన్నారు. ఏం జరిగిందో తెలుసుకుని పూర్తిగా స్పందిస్తానని అన్నారు.

ఉద్యమం సమయంలో ఎన్నో ప్రలోభాలకు లొంగని ఈటల.. ఇప్పుడు తప్పు చేస్తారా? అనేది ప్రజలు ప్రశ్నించుకోవాలిని అన్నారు. 20ఏళ్లుగా రాజకీయాల్లో మచ్చలేని వ్యక్తిగా ఉన్నానని అన్నారు. ముఖ్యమంత్రిని కలిసే ఆలోచన కూడా లేదని అన్నారు ఈటల.

మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తమ భూములు కబ్జా చేశాడని రైతులు ఫిర్యాదు చేయడంతో సీఎం కేసీఆర్‌ తక్షణమే విచారణకు ఆదేశించారు. ఈ అంశంపై హై స్పీడ్‌లో దర్యాప్తు కొనసాగగా.. ఈటల నుంచి వైద్య ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమ శాఖను సీఎం కేసీఆర్‌కు బదిలీ చేస్తూ గవర్నర్‌ ఉ‍త్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంతో ఈటల ఏ శాఖ లేని మంత్రిగా మారిపోయారు.