Huzurabad : టీఆర్ఎస్‌‌లో చేరిన కౌశిక్ రెడ్డి

Huzurabad : టీఆర్ఎస్‌‌లో చేరిన కౌశిక్ రెడ్డి

Huzurabad

P Kaushik Reddy Join TRS : హుజూరాబాద్ నియోజకవర్గంలో త్వరలోనే ఉప ఎన్నిక జరుగనుంది. దీంతో రాజకీయ పరిణామాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. 2021, జూలై 21వ తేదీ బుధవారం ఉదయం సీఎం కేసీఆర్ సమక్షంలో కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో అధికారికంగా చేరారు. కౌశిక్ రెడ్డికి టీఆర్ఎస్ కండువా కప్పిన సీఎం కేసీఆర్..పార్టీలోకి స్వాగతం పలికారు.

Read More : Heavy Rain : విషాదం.. గోడకూలి ఏడుగురు మృతి

ఆయనతో పాటు ఇతరులు నేతలు గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, ప్రభుత్వం విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఇతర నేతలు పాల్గొన్నారు.

Read More : TTD Agarabatti : ఆగస్టు 15 నుంచి మార్కెట్ లోకి టీటీడీ అగరబత్తి…!

హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి కోస‌మే తాను టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్లు పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు, మ‌ద్ద‌తుదారుల‌ కోరిక మేర‌కు టీఆర్ఎస్‌లో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ఆయన ప్రశంసించారు. రైతుబంధు ప‌థ‌కం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచే అమ‌లైనట్లు చెప్పుకొచ్చారు. ఈటల రాజేందర్ ఏడేళ్లుగా మంత్రిగా ఉంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని విమర్శించారు కౌశిక్ రెడ్డి. టీఆర్ఎస్‌లో నెంబర్ 2గా ఉంటూ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పనిచేశారని అన్నారు.

Read More : Andhra Pradesh : 24 గంటల్లో 2, 527 కేసులు, 19 మంది మృతి

మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేటలో 60 ఎకరాలకు పైగా అసైన్డ్ భూములను ఈటల ఆయన అనుచరులు కబ్జాలకు పాల్పడ్డారని సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు అందింది. దీనిపై ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసింది. ఈటల కుటుంబానికి చెందిన జమున హ్యాచరీస్ కు మెదక్ జిల్లా కలెక్టర్ వెళ్లి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. అనంతరం ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందచేశారు. దీనిని పరిశీలించిన ప్రభుత్వం..ఈటల అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలు ఉండడంతో బర్తరఫ్ చేయాలని గవర్నర్ కు సిఫార్సు చేసింది. దీంతో ఆయన బర్తరఫ్ అయ్యారు.

Read More : RS Praveen Kumar : మాజీ ఐపీఎస్ ప్రవీణ్‌కుమార్‌పై కేసు నమోదు చేయండి- జడ్జి ఆదేశాలు

అనంతరం ఈటల రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక త్వరలో జరగనుంది. ఈటల బీజేపీలో చేరడంతో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీ తరపున గతంలో కౌశిక్ రెడ్డి..ఈటలపై పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈటెల బీజేపీలో చేరడంతో ఈయన టీఆర్ఎస్ లో చేరుతారని తొలుత ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని కౌశిక్ రెడ్డి గతంలో ఖండించినా..ఇప్పుడు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మరి..హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా అధిష్టానం ఎవరినీ ప్రకటిస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది.