Friends Killed : స్నేహితుడిని చంపిన ఫ్రెండ్స్..నిందితులను పట్టించిన బైక్
ప్రాణ స్నేహితులే ఓ వ్యక్తి ప్రాణాలు తీశారు. స్నేహితుడిని హతమార్చిన మూడు నెలలకు నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. హత్యకు గురైన యువకుడి బైక్ వారిని పట్టించింది. దీంతో నిందితులు కటకటాల్లో చిప్పకూడు తింటున్నారు. మిత్రద్రోహానికి కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నారు.

Kill
Friends killed : ప్రాణ స్నేహితులే ఓ వ్యక్తి ప్రాణాలు తీశారు. స్నేహితుడిని హతమార్చిన మూడు నెలలకు నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. హత్యకు గురైన యువకుడి బైక్ వారిని పట్టించింది. దీంతో నిందితులు కటకటాల్లో చిప్పకూడు తింటున్నారు. మిత్రద్రోహానికి కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నారు.
జోగులాంబ గద్వాల్ జిల్లా ధరూర్ మండలంలోని చిన్నపాడుకు చెందిన సాయికుమార్ తో మహబూబ్‌నగర్‌కు చెందిన శ్రీకాంత్, మరో వ్యక్తి సాయికుమార్‌తో స్నేహంగా ఉండేవారు. వీరంతా రెండు నెలల క్రితం రేలంపాడు దగ్గర మద్యం తాగుతూ గొడవపడ్డారు. దీంతో శ్రీకాంత్, మరో వ్యక్తి బీరు సీసాతో దాడి చేయడంతో సాయికుమార్ అక్కడికక్కడే చనిపోయాడు. ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని రేలంపాడు జలాశయం దగ్గర పూడ్చి పెట్టారు.
Cannabis : రాక్షసుడు..గంజాయికి రూ.50 ఇవ్వలేదని స్నేహితుడిని హత్యచేశాడు
మరోవైపు తమ కుమారుడు కనిపించకుండా పోవడంతో సాయికుమార్ తల్లిదండ్రులు నెలరోజులపాటు గాలించారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలో బైక్ వివాదం బయటకు వచ్చింది. హత్య జరిగిన తర్వాత సాయికుమార్ బైక్‌ను నిందితులిద్దరూ రేవులపల్లికి తీసుకెళ్లి ఓ వ్యక్తి దగ్గర 20వేలకు కుదువపెట్టారు.
బైక్‌ను తన దగ్గర ఉంచుకున్న వ్యక్తి…. ఆర్సీ వివరాలు పరిశీలించగా… అది సాయికుమార్‌కు చెందినదిగా తేలడంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. ఈ క్లూ సాయంతో దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు.. శ్రీకాంత్, మరొకరిని అదుపులోకి తీసుకుని విచారించారు. సాయికుమార్‌ను తామే హత్య చేశామని నిందితులిద్దరూ అంగీకరించారు.