Hyderabad Weather: హైదరాబాద్‌లో ఒక్కసరిగా మారిపోయిన వాతావరణం

 హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. శుక్రవారం మధ్యాహ్నం వరకు విపరీతమైన వేడితో చెమటలు పట్టగా..అందుకు పూర్తి బిన్నంగా శనివారం ఉదయానికే వాతావరణం చల్లబడింది

Hyderabad Weather: హైదరాబాద్‌లో ఒక్కసరిగా మారిపోయిన వాతావరణం

Weather

Hyderabad Weather: హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. శుక్రవారం మధ్యాహ్నం వరకు విపరీతమైన వేడితో చెమటలు పట్టగా..అందుకు పూర్తి బిన్నంగా శనివారం ఉదయానికే వాతావరణం చల్లబడింది. శుక్రవారం మధ్యాహనానికి నగరంలో 38 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా..శనివారం మధ్యాహ్నం 33 డిగ్రీలుగా నమోదు అయింది. శుక్రవారం సాయంత్రం వరకు చిరుజల్లులు మరియు ఈదురు గాలులు కొంత ఉపశమనం కలిగించడంతో భాగ్యనగర వాసులు వారాంతంలో ‘చల్లగా’ ఆస్వాదిస్తున్నారు. శనివారం పాక్షికంగా మేఘావృతమైన ఆకాశం, చిరుజల్లులు కురియడంతో నగరంలోని కొన్ని ప్రాంతాలకు తాత్కాలిక ఉపశమనం కలిగించాయి. నైరుతి రుతుపవనాలు కేరళను తాకేందుకు మరో రెండు రోజులు సమయం ఉండగానే..ముందస్తు వర్షాకాలం వచ్చేసింది.

Other Stories:Lightning Strikes: బీహార్‌లో పిడుగు పాటుకు గురై 33 మంది మృతి: విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ

రానున్న 4-5 రోజులలో తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలలో ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని IMD వాతావరణ విభాగం అంచనా వేసింది. నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. మే 29 నాటికి..తెలంగాణ వరకు వ్యాపించవచ్చని వాతావరణ విభాగం అంచనా వేసింది. మరోవైపు ఉత్తరాన..బీహార్, పశ్చిమబెంగాల్..ఈశాన్యంలో అస్సాం, దక్షిణాన కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు అస్సాం రాష్ట్రంలో పలు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. జనజీవనం ఎక్కడికక్కడే స్తంభించింది. రైలు, రోడ్డు మార్గాలు కొట్టుకుపోయాయి. విపత్తు నిర్వహణ బృందాలు, కేంద్ర సహాయక బృందాలు ముమ్మర సహాయక చర్యలు చేపడుతున్నాయి.

Other Stories: Tirumala : శ్రీవారి భక్తులకు శుభవార్త రూ.300 దర్శనం టికెట్లు కొద్దిసేపట్లో విడుదల