Telangana : తెలంగాణ వచ్చాక కన్నీళ్లు తప్ప ఏమొచ్చింది…? ఇక కేసీఆర్ డౌన్ ఫాల్ స్టార్ట్ : గద్దర్

ఓటు హక్కుతోనే ఈ పాలకుడిని గద్దె దించాలి అంటూ సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు గద్దర్. అది జరగాలంటే యువతలో రాజకీయ చైతన్యం రావాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ పతనమయ్యే స్టేజ్ వచ్చిందని..కేసీఆర్ డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు గద్దర్.

Telangana : తెలంగాణ వచ్చాక కన్నీళ్లు తప్ప ఏమొచ్చింది…? ఇక కేసీఆర్ డౌన్ ఫాల్ స్టార్ట్ : గద్దర్

Gaddar supports Sharmila

Telangana : పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం.. కానీ తెలంగాణ వచ్చాక ఏమొచ్చింది? కన్నీళ్లు తప్ప ఏమొచ్చాయి? అంటూ నిరుద్యోగుల గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు ప్రజాగాయకుడు గద్దర్. తెలంగాణలో tspsc ప్రశ్నాపత్రాల లీక్ పై వైఎస్సార్ టీపీ ఆధ్వర్యంలో పార్టీ అధినేత్రి షర్మిల అఖిల పక్ష నేతలతో ఇందిరాపార్క్ వద్ద ‘టీసేవ్’ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ప్రజాగాయకుడు గద్దర్ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గద్దర్ మాట్లాడుతూ..నీళ్లు నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ కోసం పోరాడం కానీ ఈనాడు యువతకు నియామకాలు ఎక్కడ ఉన్నాయి? అంటూ ఆవేదన వ్యక్తంచేశారు గద్దర్. ఓటు హక్కుతోనే ఈ పాలకుడిని గద్దె దించాలి అంటూ సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు గద్దర్. అది జరగాలంటే యువతలో రాజకీయ చైతన్యం రావాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ పతనమయ్యే స్టేజ్ వచ్చిందని..కేసీఆర్ డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు గద్దర్.

ఈ సందర్భంగా గద్దర్ షర్మిలకు రాజ్యాంగ ప్రతిని బహుకరించారు. అనంతరం మాట్లాడుతూ షర్మిలపై ప్రశంసలు కురిపించారు.  తెలంగాణ ప్రజలకు కోరుకున్నట్లుగా ప్రత్యేక తెలంగాణ వచ్చింది కానీ గ్రామ తెలంగాణ రాలేదని..ప్రజలు సంతోషంగా జీవించగలిగే గ్రామ తెలంగాణను తీసుకురావాలని షర్మిలను కోరుతున్నా అంటూ వ్యాఖ్యానించారు. టీ సేవ్ కు నా సంపూర్ణ మద్దతు.. అని తెలిపారు. షర్మిల రాజకీయ శక్తి కాబట్టే ఆమెను ఇంటినించి బయటకు రానివ్వడం లేదని..నిరుద్యోగుల తరపున పోరాటంలో షర్మిల మంచి నిర్ణయం తీసుకుందని ప్రశంసించారు.షర్మిల తెలంగాణ నాడి పట్టుకుందని తెలంగాణ యువతకు ఏది కావాలో దాని గురించే షర్మిల పోరాడుతోందని ఇక కేసీఆర్ పతన మొదలైంది అని అన్నారు.

రాజ్యాంగం ప్రకారం షర్మిల పోలీసులను ప్రశ్నించారు..పోరాటం చేస్తున్న తనను ఎందుకగ అడ్డుకుంటున్నారని ప్రశ్నించింది దాంట్లో అరెస్ట్ చేసేంత తప్పేముంది? అని ప్రశ్నించారు.రేపటి నుంచి ప్రతి ఒక్కరు రాజ్యాంగన్నీ మెడకు కట్టుకుని నడవల్స్నిన పరిస్థితి నెలకొందని అన్నారు.షర్మిల ఏ అసెంబ్లీకో, ఫార్మ్ హౌస్ కో వెళ్తానని చెప్పలేదుగా..సిట్ ఆఫీసుకు వెళుతుంటే ఎందుకు అడ్డుకున్నారు?అంటూ ప్రశ్నించారు. షర్మిలకు రాజ్యాంగ ప్రతిని బహుకరించిన గద్దర్ అమ్మ విజయమ్మను అడిగినట్లు చెప్పమని షర్మిలకు చెప్పారు. కాగా షర్మిల చేపట్టిన ఈ ‘టీ సేవ్’ కార్యక్రమానికి మద్దతు కరవు అయ్యింది. ఏ ప్రతిపక్ష పార్టీ నేతలు హాజరుకాలేదు.