Aurobindo pharma : బాచుపల్లి అరబిందో ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్ .. స్పృహ తప్పి పడిపోయిన ఉద్యోగులు
హైదరాబాద్ నగరంలోని బాచుపల్లిలో ఉన్న అరబిందో ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్ అయ్యింది. దాంతో ఏగుడురు ఉద్యోగులు స్పృహ తప్పి పడిపోయారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన వీరిన హుటాహుటీన ఎస్ ఎల్జీ ఆస్పత్రికి తరలించారు.

Aurobindo Gas leaked
Gas Leakage In Bachupally Aurobindo : హైదరాబాద్ నగరంలోని బాచుపల్లిలో ఉన్న అరబిందో ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్ అయ్యింది. దాంతో ఏడుగురు ఉద్యోగులు స్పృహ తప్పి పడిపోయారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన వీరిన హుటాహుటీన ఎస్ ఎల్జీ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరిద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు తెలిపారు.
బాచుపల్లి అరబిందో ఫార్మా పరిశ్రమలో నుంచి గ్యాస్ లీక్ కావటంతో ఆ గ్యాస్‌ను పీల్చిన ఏడుగురు ఉద్యోగులు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఫార్మా కంపెనీ యాజమాన్యం.. వారిని ఎస్ఎల్‌జీ ఆస్పత్రిలో చేర్పించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. దీంతో మిగిలిన ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. కాగా గ్యాస్ లీకేజీకి గల కారణం తెలియాల్సి ఉంది. రియాక్టర్ల నుంచి గ్యాస్ లీక్ అవ్వటంతో అక్కడకు వద్దకు అరబిందో సిబ్బంది ఎవ్వరిని వెళ్లనివ్వడం లేదు.