Minister Mallareddy : మంత్రి మల్లారెడ్డిపై దాడి..రేవంత్ రెడ్డి అనుచరులు సహా 16 మందిపై కేసులు నమోదు

మంత్రి మల్లారెడ్డి మీద జరిగిన దాడి ఘటనపై ఇవాళ టీఆర్‌ఎస్‌ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలంటూ ఘట్‌కేసర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌ రెడ్డి, ఇతర టీఆర్‌ఎస్‌ నేతలు ఫిర్యాదు చేశారు.

Minister Mallareddy : మంత్రి మల్లారెడ్డిపై దాడి..రేవంత్ రెడ్డి అనుచరులు సహా 16 మందిపై కేసులు నమోదు

Police Case

Minister Mallareddy : తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై దాడి కేసులో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. ఘట్ కేసర్ పోలీసులు 16 మందిపై కేసులు నమోదు చేశారు. రేవంత్ రెడ్డి అనుచరులు సోమశేఖర్ రెడ్డి, హరివర్థన్ రెడ్డిలపై కేసు నమోదు చేశారు. మరికొందరి పేర్లను పోలీసులు చేర్చారు. సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి మీద జరిగిన దాడి ఘటనపై ఇవాళ టీఆర్‌ఎస్‌ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దాడి చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలంటూ ఘట్‌కేసర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌ రెడ్డి, ఇతర టీఆర్‌ఎస్‌ నేతలు ఫిర్యాదు చేశారు. రెడ్డి సింహ గర్జన సభలో మంత్రి మల్లారెడ్డిపై చెర్లు, బాటిల్స్, రాళ్లు, చెప్పులు విసిరిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. రెడ్డి సభలోకి కొంతమంది దుండగులు ప్రవేశించారని.. వారే ఈ దాడికి పాల్పడ్డట్టు ఫిర్యాదులో తెలిపారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలని టీఆర్ఎస్‌ నేతలు డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ నేతలు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు 16 మందిపై కేసులు నమోదు చేశారు.

Minister Mallareddy : మంత్రి మల్లారెడ్డి మీద దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు

మంత్రి మల్లారెడ్డిపై దాడి జరిగినట్లు తమకు ఫిర్యాదు వచ్చిందని సీఐ చంద్రబాబు తెలిపారు. టీఆర్ఎస్ నేతలు, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు ఫర్యాదు చేశారని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై లీగల్ ఒపీనియన్ తీసుకుని ముందుకెళ్తామని చెప్పారు. సీపీటీవీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదన్నారు. దాడి చేసిన వారు లోకలా, నాన్ లోకలా అని ఆరా తీస్తున్నామని చెప్పారు. నిందితులను గుర్తించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ శివారులో ఆదివారం(మే29,2022)సాయంత్రం నిర్వహించిన రెడ్ల సింహగర్జన మహాసభలో మంత్రి మల్లారెడ్డి ప్రసంగిస్తుండగా కొందరు కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో మంత్రి తన ప్రసంగాన్ని నిలిపివేశారు. అయినప్పటికీ నిరసనకారులు రెచ్చిపోవడంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేసిన నిరసనకారులు మల్లారెడ్డి కాన్వాయ్ వెంట పరుగులు తీశారు. చేతికందిన కుర్చీలు, మంచినీళ్ల సీసాలు కాన్వాయ్ పై విసురుతూ దాడి చేశారు. పోలీసులు వలయంగా ఏర్పడి మంత్రిని అక్కడి నుంచి తరలించారు.