Gold Price Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..

తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ ధరలు స్వల్పంగా తగ్గాయి. ఈ నెల 5న రికార్డు స్థాయిలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,360 పలికింది. తరువాత క్రమంగా తగ్గుతూ వస్తుంది. సోమవారం ఉదయం వరకు రూ. 60,870గా ఉంది.

Gold Price Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..

Gold price

Gold Price Today: కొద్దిరోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న బంగారం (Gold), వెండి (silver) ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న క్రమంలో చాలా మంది బంగారాన్ని ఒక పెట్టుబడి సాధనంగా భావిస్తూ భారీ మొత్తం ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ కారణంగా గోల్డ్ ధరలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. గత  నాలుగు రోజుల క్రితం 24 క్యారెట్ల బంగారం ధర గరిష్ట స్థాయిని తాకింది. ఆ తరువాత నుంచి క్రమంగా ధరలు తగ్గుముఖం పట్టాయి. గడిచిన మూడు సెషన్లలో బంగారం ధర తులంపై రూ. 410 మేర తగ్గింది.

Gold Price High: మహిళలకు బిగ్‌షాక్.. ఆకాశాన్ని తాకుతున్న గోల్డ్ ధరలు.. ఆల్ టైమ్ హైకి చేరిన వెండి

సోమవారం ఉదయం వరకు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు చూస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 61,020గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,940గా ఉంది. ముంబైలో 24 క్యారెట్లు 60,860గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,790గా ఉంది. ఇక చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,520గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,390గా ఉంది.

Gold Price: బెంబేలెత్తిస్తున్న బంగారం.. భారత్‌లో రికార్డు స్థాయికి గోల్డ్ ధరలు

తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,860 పలుకుతుండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,970 గా ఉంది. విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,860, అదేవిధంగా 22 క్యారెట్ల గోల్డ్ ధర 55,790గా ఉంది. విశాఖపట్టణంలో 24 క్యారెట్ల ధర రూ. 60,860 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర 55790గా ఉంది. ఇక వెండి ధరల విషయానికి ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 76,600గా ఉంది. అదేవిధంగా ముంబైలో కిలో వెండి ధర రూ. 76వేలు, చెన్నైలో 80,200, కేరళలలో 76,600గా ఉంది. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో.. హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ. 80,200 కాగా, విజయవాడలో రూ. 80,200, విశాఖపట్టణంలో 80,200 గా ఉంది.

 

గోల్డ్ ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఏప్రిల్ 5న 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ ధర రికార్డు స్థాయికి చేరింది. 61,360 పలికింది. ఆ తరువాత రోజు నుంచి క్రమంగా ధర తగ్గుతూ వచ్చింది. ఏప్రిల్ 6న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 60,980 ఉండగా, 8వ తేదీన 60,870కి చేరింది. తాజాగా సోమవారం 60,860కి చేరింది.