Bandi Sanjay : సీఎం పదవి కోసం కేటీఆర్, హరీశ్ కొట్టుకుంటున్నారు.. కేసీఆర్ ఆటలో రేవంత్ బలి కాబోతున్నారు- బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

బీజేపీ లిస్ట్ ఢిల్లీకి పంపించాం. కానీ, కాంగ్రెస్ లిస్ట్ మాత్రం ఇంకా ప్రగతి భవన్ లోనే ఉంది. కేసీఆర్ స్టాంప్ పడలేదు. ఆయన 30మంది అభ్యర్థుల పేర్లు చెప్పి ఆమోద ముద్ర వేశాకే ఢిల్లీకి పోతుంది. Bandi Sanjay

Bandi Sanjay : సీఎం పదవి కోసం కేటీఆర్, హరీశ్ కొట్టుకుంటున్నారు.. కేసీఆర్ ఆటలో రేవంత్ బలి కాబోతున్నారు- బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay Slams KCR (Photo : Facebook, Google)

Updated On : October 12, 2023 / 9:03 PM IST

Bandi Sanjay Slams KCR : తెలంగాణలో ఎన్నికల హీట్ పెరిగింది. అధికార, విపక్షాల మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి. ఛాన్స్ చిక్కితే చాలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. సై అంటే సై అంటూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు. నేతల మధ్య మాటల యుద్ధంతో ఎన్నికల హీట్ పీక్స్ కి చేరింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ టార్గెట్ గా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్, రేవంత్ రెడ్డిలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

సీఎం కేసీఆర్ ఆటలో రేవంత్ రెడ్డి, మంత్రి హరీశ్ రావులు బలి పశువులు కాబోతున్నరు అని బండి సంజయ్ తెలిపారు. సీఎం కేసీఆర్ దగ్గర మేనిఫెస్టోపై హరీశ్ రావు, కేటీఆర్ చర్చ పెద్ద డ్రామా అన్నారు బండి సంజయ్. సీఎం పదవి కోసమే వారిద్దరూ కొట్టుకుంటున్నారు అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

Also Read : షర్మిల ఔట్‌.. కోదండరామ్‌ ఇన్‌.. గెలుపే టార్గెట్‌గా కాంగ్రెస్‌ ఎత్తుగడలు!

”కేసీఆర్ ఆమోద ముద్ర పడనందునే కాంగ్రెస్ లిస్ట్ ఫైనల్ కాలేదు. అత్యంత దీనావస్థలో బీఆర్ఎస్ ఉంది. అడ్డా కూలీలకు పైసలిచ్చి కండువా కప్పి షో చేస్తూ ప్రచారం చేసుకునే దుస్థితి బీఆర్ఎస్ ది. ఎంఐఎం, కాంగ్రెస్ తో కలిపి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ ఎత్తుగడ. బీజేపీ గ్రాఫ్ ను తగ్గించేందుకు ఆ మూడు పార్టీలు కుట్ర చేస్తున్నాయి.

బీజేపీ లిస్ట్ ఢిల్లీకి పంపించాం. కానీ, కాంగ్రెస్ లిస్ట్ మాత్రం ఇంకా ప్రగతి భవన్ లోనే ఉంది. కేసీఆర్ స్టాంప్ పడలేదు. ఆయన 30మంది అభ్యర్థుల పేర్లు చెప్పి ఆమోద ముద్ర వేశాకే ఢిల్లీకి పోతుంది. పాపం రేవంత్ రెడ్డికి ఈ విషయం తెలియదు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి ఎలాగైనా అధికారంలోకి రావాలని కుట్ర చేస్తున్నాయి” అని బండి సంజయ్ ఆరోపించారు.

Also Read : మళ్లీ రేసులోకి జానారెడ్డి.. సీఎం పీఠంపైనే పెద్దాయన గురి!