Harish Rao: సిద్దిపేట అంటే అభివృద్ధి.. అభివృద్ధి అంటే సిద్దిపేట – హరీశ్ రావ్

సిద్దిపేట పట్టణ తెరాస పార్టీ విస్తతస్థాయి కార్యకర్తల సమావేశనికి మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణంపై మాట్లాడిన ప్రతిపక్ష నాయకులపై విమర్శలకు దిగారు.

Harish Rao: సిద్దిపేట అంటే అభివృద్ధి.. అభివృద్ధి అంటే సిద్దిపేట – హరీశ్ రావ్

Harish Rao

 

 

Harish Rao: సిద్దిపేట పట్టణ తెరాస పార్టీ విస్తతస్థాయి కార్యకర్తల సమావేశనికి మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణంపై మాట్లాడిన ప్రతిపక్ష నాయకులపై విమర్శలకు దిగారు. కేంద్రం ఒక్క పైసా కూడా ఇవ్వలేదనికామెంట్ చేశారు.

పదవి ఉన్నా లేకున్నా నాకు అందరూ సమానమే. పదవులందరికీ ఒకేసారి రావు. ప్రజలకు ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులే వారధులు. పార్టీ లేకుంటే కార్యకర్తలు లేరు. కార్యకర్తలు లేకుంటే పార్టీ లేదు.

రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లు సిద్దిపేట అభివృద్ధి జరిగిందని మాట్లాడారు. ఆంధ్ర నాయకులు, ఆంధ్ర మాజీ ముఖ్యమంత్రి కొడుకు సిద్దిపేట అభివృద్ధి గురించే మాట్లాడారు.

“సిద్దిపేట అంటే అభివృద్ధి.. అభివృద్ధి అంటే సిద్దిపేట. ఎప్పుడు అవార్డు వచ్చినా అందులో సిద్దిపేట ఉంటుంది. పెద్దపెద్ద దేశాల్లోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు, సిద్దిపేటలో 100శాతం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మించుకున్నాం”

Read also: అభివృద్ధిపై ప్రతిపక్షాలతో చర్చకు సిద్ధం: హరీష్ రావు

“ప్రతిపక్షా నాయకులు రాహుల్, నడ్డా ఏం మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదు. కాళేశ్వరం నీళ్లు ఒక్క ఎకరానికి కూడా నీళ్లు రాలేదని బిజెపి నడ్డా విమర్శిస్తున్నారు. బీజేపీ నాయకులు సిద్దిపేటకు రండి. కాళేశ్వరం నీళ్లు చూపిస్తా”

“కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు కేంద్రం ఒక్క రూపాయి ఇచ్చిందా. ఈ నిర్మాణంలో అవినీతి జరిగిందని, అబద్దాలు మాట్లాడి గ్లోబల్ ప్రచారం చెయ్యడంలో బీజేపీ నెంబర్ వన్ గా నిలిచింది. కాళేశ్వరానికి నిధులు ఇవ్వకుండా, అనుమతులు రాకుండా అడ్డుకున్నారు. అబద్దాలను తిప్పికొట్టాలి”

“కాంగ్రెస్ అంటేనే ఖతం పార్టీ. ప్రజలను గెలిపించిన ప్రభుత్వాన్ని కాపాడుకోలేని అసమర్థుడు రాహుల్ గాంధీ. పంజాబ్, బెంగాల్, ఉత్తరప్రదేశ్ లలో ఖతం అయిన పార్టీ కాంగ్రేస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ ద్రోహులు” అంటూవిమర్శలకు దిగారు హరీశ్ రావు.