వరంగల్ రోడ్లపై పడవలు

  • Published By: madhu ,Published On : August 18, 2020 / 10:41 AM IST
వరంగల్ రోడ్లపై పడవలు

వరంగల్ రోడ్లపై పడవలు తిరుగుతున్నాయి. ఎక్కడ చూసినా నీళ్లే దర్శనమిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు వరంగల్ అతలాకుతలమైంది. వరద నీటి పోటెత్తింది. దీంతో నగర రోడ్లపై భారీగా నీరు చేరింది.



లోతట్టు ప్రాంతాల పరిస్థితి చెప్పనవసరం లేదు. కాలనీల్లో ఇంకా నీరు ఉండిపోయింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందు, నీటి దిగ్భందనంలో చిక్కుకున్న వారికి సహయపడేందుకు పడవలను ఉపయోగించారు. వారికి కావాల్సిన సామాగ్రీని ఇచ్చారు.



వరంగల్‌లోని లోతట్టు ప్రాంతాల్లో సేవలందించేందుకు DRF బృందాలు రంగంలోకి దిగాయి. మునుపెన్నడూ లేని విధంగా వరంగల్ లో భారీ వర్టాలు కురిశాయి. వర్షాలతో నగరం అతలాకుతలమైన తరుణంలో సీఎం కేసీఆర్‌, మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.

గ్రేటర్‌ పరిధిలో ఏర్పాటు చేసిన 11 పునరావాస కేంద్రాల కు 3500మంది ముంపు ప్రాంతాల ప్రజలకు ఆశ్రయం కల్పించారు. అధికారులు అన్ని రకాల వసతులు కల్పించడంతో పాటు బల్దియా ఆధ్వర్యంలో వీరికి రెండు పూటలా భోజనం అందిస్తున్నారు.



ఇదిలా ఉంటే…ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ వరంగల్ నగరానికి చేరుకున్నారు. 2020, ఆగస్టు 18వ తేదీ మంగళవారం ఉదయం ఇక్కడకు చేరుకున్న తర్వాత..వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. స్థానిక మంత్రులతో కలిసి ఏరియల్ సర్వే చేస్తున్నారు.