Mulugu Rains – Floods : ములుగు జిల్లాలో తీవ్ర నష్టం, పెను విషాదం మిగిల్చిన వరదలు.. మేడారం, కొండాయి గ్రామాల్లో దారుణ పరిస్థితులు

ఏటూరు నాగారం మండలం దొడ్ల వద్ద జంపన్న వాగు పొంగి పొర్లడంతో కొండాయి గ్రామం నీట మునిగిపోయింది. గ్రామానికి చెందిన ఎనిమిది మంది గల్లంతు అయి ప్రాణాలు కోల్పోయారు. ఆ గ్రామంతో పది ఇళ్లు నేల మట్టం అయ్యాయి.

Mulugu Rains – Floods : ములుగు జిల్లాలో తీవ్ర నష్టం, పెను విషాదం మిగిల్చిన వరదలు.. మేడారం, కొండాయి గ్రామాల్లో దారుణ పరిస్థితులు

Floods In Mulugu

Severe Damage And Tragedy : నేల మట్టమైన ఇళ్లు, పేరుకుపోయిన బురద. ఎటు చూసినా చెత్తా చెదారం, మూగ జీవాల కళేబరాలు. వర్షాలు, వరదలు తగ్గినా.. అవి మిగిల్చిన నష్టం మాత్రం కళ్ల ముందే కనిపిస్తోంది. ములుగు జిల్లాల్లో వర్షం, వరదలు సృష్టించిన నష్టం మాటలకు అందనిది. బాధితులకు నిలువ నీడ లేదు. బుక్కెడు బువ్వ వండు కుందామన్నా పొయ్యి వెలిగించే పరిస్థితి లేదు. నిత్యవసర సరుకులు తడిసిపోవడంతో జనం ఆకలితో అలమటిస్తున్నారు.

వరదలు తగ్గినా బాధితుల కన్నీటి నుంచి వచ్చే వరద మాత్రం ఆగడం లేదు. సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ బాధితులు ధీనావస్థలో ఉన్నారు. ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ గ్రామం అంటే తెలియని వారుండరు. ప్రతి రెండేళ్లకోసారి కోటి మందికిపైగా భక్తులతో ఆ గ్రామం కిటకిట లాడుతోంది. రాష్ట్ర అధికార యంత్రాంగమంతా ఆ గ్రామంలో ఉంటుంది. అలాంటి గ్రామానికి ఇప్పుడు పెద్ద ఆపద వచ్చింది. అదే ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం.

Weather Update : పలు రాష్ట్రాల్లో నేడు భారీవర్షాలు…ఐఎండీ తాజా వెదర్ రిపోర్ట్

ఆ గ్రామంలో మునుపెన్నడూ లేని విధంగా వరదలు బీభత్సం సృష్టించాయి. గత వారం కురిసిన భారీ వర్షాలకు జంపన్న వాగు పొంగి పొర్లడంతో మేడారం గ్రామం వరల్లో చిక్కుకుంది. సమ్మక్క సారలమ్మ గద్దెల వద్దకు నీరు చేరింది. జాతరలో చిరు వ్యాపారులు జీవనాధారం కోసం ఏర్పాటు చేసుకున్న షాపులు అనుకోకుండా వచ్చిన వరదల్లో కొట్టుకుపోయాయి. సర్వం కోల్పోవడంతో లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లిందని మేడారం వ్యాపారులు కన్నీటి పర్యంతమయ్యారు.

తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. మేడారం, నర్సాపూర్, ప్రాజెక్టునగర్, ఊరట్టం, కన్నెపల్లి, కాల్వపల్లి గ్రామాలు కూడా నీట మునగడంతో స్థానికులు ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వరదలు వచ్చాయని.. దీంతో సర్వం కోల్పోయి కట్టుబట్టలు తప్ప తమకు ఏమీ మిగలేదని బాధితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వర్షం, వరదలు భారీ ఆస్తి నష్టంతోపాటు ప్రాణ నష్టాన్ని మిగిల్చాయి.

Central Govt Team : తెలంగాణకు కేంద్ర బృందం.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన

ఏటూరు నాగారం మండలం దొడ్ల వద్ద జంపన్న వాగు పొంగి పొర్లడంతో కొండాయి గ్రామం నీట మునిగిపోయింది. గ్రామానికి చెందిన ఎనిమిది మంది గల్లంతు అయి ప్రాణాలు కోల్పోయారు. ఆ గ్రామంతో పది ఇళ్లు నేల మట్టం అయ్యాయి. నిలువ నీడ లేకుండా పోయింది. ఇళ్లల్లోని టీవీలు, ఫ్రిడ్జీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, విలువైన డాక్యుమెంట్లు, వరదల్లో కొట్టుకుపోయాయి. వరదలు సృష్టించిన బీభత్సం నుంచి కొండాయి గ్రామం తేరుకోలేకపోతోంది.

ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. జంపన్న వాగు ఉధృతికి ఒకేసారి వరద నీరు చేరడంతో ఏం చేయలేని పరిస్థితిలో కొంతమంది సమీపంలో ఉన్న హాస్టల్ బల్డింగ్ లో, మరి కొందరు గ్రామ పంచాయతీ భవనాలపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. పంట పొలాల్లో ఇసుక మేటలు వేయడంతో వ్యవసాయానికి పనికి రాకుండా పోయాయి. సర్వం కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు.