Vitamin D : విటమిన్-డి తో కరోనాకు చెక్.. మరణాలు తగ్గిస్తుంది.. హైదరాబాద్ డాక్టర్ల అధ్యయనంలో కీలక విషయాలు

హైదరాబాద్ కి చెందిన నిమ్స్, గాంధీ ఆసుపత్రి వైద్యులు ఓ కీలక విషయాన్ని కనుగొన్నారు. కోవిడ్ చికిత్స ప్రోటోకాల్స్ లో విటమిన్ డి ని జోడించడం వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయంటున్నారు మన హైదరాబాదీ వైద్య నిపుణులు. గత కొంత కాలంగా దీనిపై పరిశోధన చేస్తున్న గాంధీ,

Vitamin D : విటమిన్-డి తో కరోనాకు చెక్.. మరణాలు తగ్గిస్తుంది.. హైదరాబాద్ డాక్టర్ల అధ్యయనంలో కీలక విషయాలు

Vitamin D Reduce Covid Infection

Vitamin D Reduce Covid Infection : ప్రపంచవ్యాప్తంగా కరోనా గురించి పరిశోధనలు, దాన్ని నిరోధించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న ప్రయోగాలు, కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు.. ఎక్కడి చూసినా ఇవే కనిపిస్తున్నాయి. విటమిన్లు, ప్రోటీన్లు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలని అనుకుంటున్నారు. విటమిన్ ట్యాబ్లెట్లు వేసుకోవాలంటున్నారు. చాలాకాలం క్రితమే విటమిన్ డీకి సంబంధించిన కొన్ని విషయాలు వెల్లడించారు నిపుణులు. విటమిన్ డి లోపం ఉన్నవారికి కరోనా సోకే అవకాశాలు ఎక్కువ అని చెప్పుకొచ్చారు.

దీనిపై ఇప్పుడు హైదరాబాద్ కి చెందిన నిమ్స్, గాంధీ ఆసుపత్రి వైద్యులు ఓ కీలక విషయాన్ని కనుగొన్నారు. కోవిడ్ చికిత్స ప్రోటోకాల్స్ లో విటమిన్ డి ని జోడించడం వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయంటున్నారు మన హైదరాబాదీ వైద్య నిపుణులు. గత కొంత కాలంగా దీనిపై పరిశోధన చేస్తున్న గాంధీ, నిమ్స్ వైద్యులు చేపట్టిన అధ్యయన నివేదికను ప్రముఖ నేచర్.కామ్(www.nature.com) జర్నల్ లో ప్రచురితమైంది.

కోవిడ్ సోకిన వారికి రోజువారీ అందించే వైద్యంలో అధిక మోతాదులో నోటి ద్వారా విటమిన్ డి అందిస్తే ప్రభావం గణనీయంగా ఉంటుందంటున్నారు వైద్య నిపుణులు. విటమిన్-డి పొందిన రోగుల్లో అన్ని ఇన్ ప్లేమేటరీ మార్కర్స్ లో గణనీయమైన తగ్గుదుల ఉందని గుర్తించారు. అంతేకాదు కరోనా రోగుల్లో మరణాల ముప్పుని కూడా గణనీయంగా తగ్గిస్తుందని అధ్యయనంలో తేలింది.

విటమిన్ డి 80 నుంచి 100 ఎన్ జి/ఎల్ ను అందించడం ద్వారా ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా కొవిడ్ వైరస్ ను గణనీయంగా తగ్గించినట్లు చెబుతున్నారు. అందువల్ల మెరుగైన ఫలితాల కోసం విటమిన్ డి థెరపీని కరోనా ప్రస్తుత చికిత్స ప్రొటోకాల్ లో చేర్చవచ్చని వెల్లడించారు.

విషయం ఏంటంటే మన దేశంలో దాదాపు 90శాతం మంది విటమిన్-డి లోపంతో బాధపడుతున్నారు. వారి శరీరాల్లో సగటున 13 నుంచి 15 ఎన్జీ విటమిన్ మాత్రమే ఉందంటున్నారు. ఇది ఏమాత్రం బాడీకి సరిపోదని, ఇప్పుడు తీసుకుంటున్న ఆహారంలో విటమిన్ డి తో పాటు సూర్యరశ్మి ద్వారా కూడా విటమిన్ డి పెంచుకోవచ్చు. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య సూర్యరశ్మి ద్వారా సరిపడ విటమిన్ డి మనిషికి అందుతుందని అంటున్నారు. కానీ, వీరిపై కూడా విపరీతమైన కాలుష్యంతో పాటు మనుషుల వయసు ప్రభావం కూడా ఉంటుందని చెబుతున్నారు.

విటమిన్ డి లెవెల్ 55 ఎన్జీ కంటే ఎక్కువ ఉన్నవారిలో 5శాతం కంటే తక్కవమందికి కొవిడ్ సోకుతుందని అంటున్నారు. అలాగే 60 ఎన్జీ ఉన్నవారిలో మరణాల శాతం దాదాపు సున్నాగా ఉందంటున్నారు. 30ఎన్జీ కంటే తక్కువ విటమిన్ డి ఉంటే మరణాల ముప్పు ఎక్కువగా ఉంటుందన్నారు.