Khairatabad Ganesh : ఖైరతాబాద్‌ గణేశ్ శోభాయాత్ర, నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు

ఖైరతాబాద్‌ భారీ గణనాథుని నిమజ్జనానికి ఉత్సవ సమితి సభ్యులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. నిమజ్జనానికి మరికొద్ది గంటల సమయం ఉండటంతో.. శోభాయాత్ర ఏర్పాట్లను ముమ్మరం చేశారు.

Khairatabad Ganesh : ఖైరతాబాద్‌ గణేశ్ శోభాయాత్ర, నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు

Ganesh (1)

Khairatabad’s Ganesh immersion : ఖైరతాబాద్‌ భారీ గణనాథుని నిమజ్జనానికి ఉత్సవ సమితి సభ్యులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. నిమజ్జనానికి మరికొద్ది గంటల సమయం ఉండటంతో.. శోభాయాత్ర ఏర్పాట్లను ముమ్మరం చేశారు. 40 అడుగుల్లో.. పంచముఖ రుద్ర మహా గణపతిగా కొలువుదీరిన విఘ్నేశ్వరున్ని.. రేపు గంగ ఒడికి చేర్చనున్నారు. ఇవాళ అర్ధరాత్రికే కలశపూజ చేసి.. విగ్రహ తరలింపు ఏర్పాట్లను ప్రారంభించనున్నారు.

ఇక ఇప్పటికే విజయవాడ నుంచి భారీ క్రేన్‌ ఖైరతాబాద్‌కు చేరుకుంది. ట్రాలీ మీద గణపతి విగ్రహాన్ని ఉంచేలా.. వెల్డింగ్‌ పనులు కూడా పూర్తయ్యాయి. గణపతి విగ్రహం పక్కన ఉన్న నాగదేవత, కృష్ణకాళీ విగ్రహాల కోసం ప్రత్యేక ట్రాలీ ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 9 గంటల ప్రాంతంలో ప్రారంభంకానున్న ఖైరతాబాద్‌ గణేశుని శోభాయాత్ర.. మధ్యాహ్నం రెండు గంటల్లోపూ పూర్తవుతుందంటున్నారు ఉత్సవ సమితి నిర్వాహకులు.

CP Anjanikumar : తొలిసారి పీవీ మార్గ్ లోనూ గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు : సీపీ అంజనీకుమార్

ఎప్పటిలానే రూట్‌ మ్యాప్‌ ప్రకారం.. ద్వారకా హోటల్‌, టెలీఫోన్‌ భవన్‌, ఇక్బాల్‌ మినార్‌, ఓల్డ్‌ సెక్రటేరియట్‌ గేట్‌, తెలుగుతల్లి ఫ్లైఓవర్‌, లుంబినీ పార్క్‌ మీదుగా ఖైరతాబాద్‌ గణేశుని శోభాయాత్ర జరగనుంది. క్రైన్ నెంబర్ 4 వద్ద ఖైరతాబాద్ గణేశుని నిమజ్జనం జరుగనుంది.