Huzurabad ByPoll :హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి కోసం ఇంటర్వ్యూలు

హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ కొత్త పంథా తీసుకొచ్చింది. ఆసక్తి ఉన్నవారు బుధవారం ఉదయం 10గంటల నుంచి సెప్టెంబర్ 5ఆదివారం సాయంత్రం 5గంటల్లోపే...

Huzurabad ByPoll :హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి కోసం ఇంటర్వ్యూలు

Huzurabad By Election

Huzurabad By-Election: హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ కొత్త పంథా తీసుకొచ్చింది. ఆసక్తి ఉన్నవారు బుధవారం ఉదయం 10గంటల నుంచి సెప్టెంబర్ 5ఆదివారం సాయంత్రం 5గంటల్లోపే దరఖాస్తులు సమర్పించుకోవాల్సిందంటూ వెల్లడించింది. అలా అప్లై చేసినప్పుడు దాంతో పాటు రూ.5వేల డీడీ కూడా ఇవ్వాలని నిర్ణయించారు.

అభ్యర్థులను సెప్టెంబర్ 6వ తేదీన సీనియర్ల బృందం ఇంటర్వ్యూ చేస్తుంది. భట్టి, దామోదర్ రాజనర్సింహ, పొన్నం ,జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు తోపాటు వరంగల్ డీసీసీ ప్రెసిడెంట్ నాయిని రాజేందర్ రెడ్డి , కరీంనగర్ డీసీసీ ప్రెసిడెంట్ కవ్వంపల్లి సత్యనారాయణ సభ్యులుగా ఏర్పాటైన కమిటీ అభిప్రాయాలను ఏఐసీసీకి పంపిస్తారు.

సెప్టెంబర్ 10తర్వాత వెళ్లే నివేదిక ఆధారంగా అభ్యర్థి పేరును ప్రకటిస్తారు. ఇప్పటికే పోటాపోటీగా బీజేపీ, టీఆర్ఎస్ లు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తూ హుజూరాబాద్ ఉపఎన్నిక కోసం కష్టపడుతున్నాయి. మధ్యలో కాంగ్రెస్ ఇంటర్వ్యూ ప్రక్రియ ద్వారా ఎంత మేర సక్సెస్ అవుతుందో చూడాలి మరి.

ప్రెస్ మీట్‌లో ఈ వివరాలు వెల్లడించిన వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్.. బీజేపీ, టీఆర్ఎస్ లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నిజాం ఆస్తుల విషయం తీసుకొచ్చి బండి సంజయ్ మతాలను రెచ్చగొడుతున్నారు. సీలింగ్ ల్యాండ్స్ ఎత్తివేసిన ఘనత, రాజా సంస్థానాలు వారి ఆభరణాలు రద్దు చేసిన ఘనత కూడా ఇందిరా గాంధీదే అన్నారు.

ఏడేళ్లుగా మోడీ సర్కార్ కు నిజాం ఆస్తులు కనిపించలేదా.. కేంద్ర రాష్ట్ర సర్కార్ లు ఆడుతున్న డ్రామా ఇది. ఫ్రజలను రెచ్చగొట్టడానికే ఈ కామెంట్స్ చేస్తున్నారు.
Ghmc ఎన్నికల్లో బండి పొతే బండి.. ఇల్లు పొతే ఇల్లు అని అన్నారు. ఎన్నికలైపోయాక చేతులెత్తేసింది టీఆర్ఎస్. హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం దళిత బంధు అంటున్నారు.

మోడీ 15 లక్షలు ప్రతి అకౌంట్ లో వేస్తామన్నారు ఏమైంది. ప్రజా సంగ్రామ యాత్ర ఎవరి కోసం.. ఎవరు చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్, సిలిండర్ ధరలు పెంచి ప్రజా సంగ్రామ యాత్రలు చేస్తున్నారా. బడా కంపెనీలను, సంస్థలను అమ్మడం సరిపోక యాత్రలు చేస్తున్నారా. రాష్ట్ర సర్కార్ ఖజానా ఖాళీచేసి.. పైసలకోసం భూములు అమ్ముకుంటుంది టీఆరెస్ నాయకుల అవినీతిపై కేంద్రం ఎందుకు ఊరుకుంటుంది.

ఈడీని రంగంలోకి దింపడం లేదెందుకు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆరెస్, పాతబస్తీలో ఎంఐఎం ఒక్కటే. అంటూ తీవ్రంగా విమర్శించారు వర్కింగ్ ప్రెసిడెంట్.