Huzurabad : పొలిటికల్ హీట్, కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ ?

వరంగల్‌ జిల్లాలో పట్టున్న కొండా సురేఖను హుజురాబాద్‌ నుంచి పోటీ చేయించాలని టీపీసీసీ యోచిస్తోందని సమాచారం. వ‌రంగ‌ల్ తూర్పు, ప‌ర‌కాల‌, భూపాల ప‌ల్లి నియోజ‌క వ‌ర్గాల్లో బల‌మైన నేత‌గా ఉన్న కొండా సురేఖ‌ను బరిలోకి దించాలని భావిస్తోంది. ప‌ద్మశాలి, మున్నూరు కాపు సామాజిక వ‌ర్గాల‌ ఓట్లు హస్తం గుర్తుకు పడతాయని అంచనా వేస్తున్నారు.

Huzurabad : పొలిటికల్ హీట్, కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ ?

Konda

Konda Surekha : హుజూరాబాద్‌లో పొలిటికల్ రేస్‌ మొదలైంది. ఉద్యమకారుడైన గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను అభ్యర్థిగా ప్రకటించిన టీఆర్ఎస్‌.. ప్రచారంలో స్పీడ్ పెంచింది. ర్యాలీలు, సభలతో కారు టాప్‌గేర్‌లో దూసుకుపోతోంది. హుజురాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ జాడలేకుండా పోయింది. గ‌తంలో హస్తం గుర్తుపై పోటీ చేసిన కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ గూటికి చేరడంతో ఆ పార్టీకి లోక‌ల్‌గా బలమున్న నేత లేకుండాపోయారు. దీంతో ప‌క్క నియోజ‌క వ‌ర్గాల నుంచి నేతల‌ను తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Read More : ISRO GSLV – 10 : రాకెట్ ప్రయోగం విఫలం, ఇస్రో వర్గాల్లో నిరాశ..లైవ్ స్ట్రీమ్ నిలిపివేత

వరంగల్ జిల్లా నేత : –
వరంగల్‌ జిల్లాలో పట్టున్న కొండా సురేఖను హుజురాబాద్‌ నుంచి పోటీ చేయించాలని టీపీసీసీ యోచిస్తోందని సమాచారం. వ‌రంగ‌ల్ తూర్పు, ప‌ర‌కాల‌, భూపాల ప‌ల్లి నియోజ‌క వ‌ర్గాల్లో బల‌మైన నేత‌గా ఉన్న కొండా సురేఖ‌ను బరిలోకి దించాలని భావిస్తోంది. ప‌ద్మశాలి, మున్నూరు కాపు సామాజిక వ‌ర్గాల‌ ఓట్లు హస్తం గుర్తుకు పడతాయని అంచనా వేస్తున్నారు. అటు క‌మ‌లాక‌ర్ రెడ్డి, కృష్ణారెడ్డిల పేర్లను కూడా టీపీసీసీ పరిశీలిస్తోంది. టీఆర్ఎస్‌, బీజేపీ ప్రచారంలో దూసుకుపోతుంటే కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థుల వడపోత దగ్గరే ఆగిపోయింది. ప్రస్తుతానికి హుజురాబాద్‌లో ద్విముఖ పోరు కనిపిస్తున్నప్పటికీ.. తాము ఎంటరయ్యాక యాంగిల్‌ ఫైట్ అవుతుందని కాంగ్రెస్‌ నేతలు చెప్పుకుంటున్నారు.

Read More : ISRO : నింగిలోకి GSLV-F10 రాకెట్‌..ఆకాశంలో ఇస్రో కన్ను

టీఆర్ఎస్ కార్యకర్తల్లో జోష్ : –
మరోవైపు…నియోజకవర్గంలోని దళితుల కోసం ప్రభుత్వం దళితబంధు పథకానికి నిధులు విడుదల చేసింది. పెండింగ్ ప‌నుల‌ను పూర్తి చేస్తామంటూ హామీలిస్తున్నారు టీఆర్ఎస్‌ నేతలు. అటు గొల్ల,కుర్మలకు గొర్లను కూడా పంపిణీ చేస్తున్నారు. మిగతా బీసీల మద్దతు కూడా కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్ హుజురాబాద్‌లోనే మకాం వేసి కార్యకర్తల్లో కొత్త జోష్‌ నింపుతున్నారు.

Read More : Child Reporter : ఏడేళ్ల బాలుడి లైవ్‌ రిపోర్టింగ్‌.. సీఎం ఫిదా

బీజేపీ అభ్యర్థి ఈటల : –
అధికారికంగా ప్రక‌టించ‌క పోయినా.. బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ దాదాపు ఖరారయ్యారు. ఈటెల రాజేంద‌ర్ నియోజ‌క వ‌ర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 11రోజుల పాటు నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర చేశారు. త‌న హయాంలో చేసిన అభివృద్ది పనులను వివరిస్తూ.. టీఆర్ఎస్‌ పార్టీలో తనకు జరిగిన అవమానాన్ని ప్రజలకు చెప్పుకుంటూ వారి మద్దతు పొందే ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్ఎస్‌కు రాజీనామా చేసినప్పటి నుంచి నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజలతో మమేకమవుతున్నారు. అటు ఈటల భార్య జమున సైతం హుజురాబాద్‌లోని పలుగ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. మరి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో రానున్న రోజుల్లో తేలిపోనుంది.