YS Sharmila : వైఎస్ షర్మిలతో ఐప్యాక్ ప్రతినిధులు భేటీ..తెలంగాణలో పాదయాత్రపై చర్చ

వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలతో ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐప్యాక్ ప్రతినిధులు సమావేశం అయ్యారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని షర్మిల నివాసంలో ఆమెతో బుధవారం సమావేశం అయ్యారు.

YS Sharmila : వైఎస్ షర్మిలతో ఐప్యాక్ ప్రతినిధులు భేటీ..తెలంగాణలో పాదయాత్రపై చర్చ

Sharmila

IPAC representatives meet YS Sharmila : వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలతో ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐప్యాక్ ప్రతినిధులు సమావేశం అయ్యారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని షర్మిల నివాసంలో ఆమెతో బుధవారం సమావేశం అయ్యారు. తెలంగాణలో పార్టీ విస్తరణతోపాటు పాదయాత్ర కార్యాచరణపై షర్మిల చర్చిస్తున్నారు. అక్టోబర్ 20 నుంచి తెలంగాణలో పాదాయత్ర చేయబోతున్నట్లుగా షర్మిల ఇప్పటికే ప్రకటించారు. ఆమెకు రాజకీయ వ్యూహ కర్తగా ప్రశాంత్ కిషోర్ పని చేయనున్నారు.

తెలంగాణలో షర్మిల పాదాయత్రకు శ్రీకారం చుట్టబోతుంది. పాదయాత్ర కార్యచరణకు సంబంధించి భవిష్యత్ కార్యాచరణతోపాటు ప్రజల్లోకి ఎలా వెళ్లాలన్న అంశంపై ఇవాళ ఐప్యాక్ టీమ్ తో ఇప్పటికే మాట్లాడారు. పాదయాత్రకు సంబంధించి ఎలా రూట్ మ్యాప్ ఎలా చేయాలి? ప్రజల్లో ప్రస్తుతమున్న సమస్యలపై ఎలా పాయింట్ అవుట్ చేయాలన్న విషయంపై ఐప్యాక్ టీమ్ తో మాట్లాడారు. కొద్దిరోజుల క్రితం ప్రశాంత్ కిషోర్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు.

Janasena : తెలంగాణ నుండి పోసానిని బహిష్కరించాలి : జనసేన మహిళ విభాగం

రానున్న ఎన్నికల్లో పోటీ చేయనుండటం, పార్టీ వ్యూహకర్తగా ఉండాలని కోరిన నేపథ్యంలో ఐప్యాక్ ఆమెను కలిచి సుమారు గంటపాటు చర్చించారు. ముఖ్యంగా పాదయాత్రకు సంబంధించి సెడ్యూల్, రూట్ మ్యాప్ పాదయాత్రలో ఎలాంటి అంశాలతో ముందుకెళ్లాలన్న అంశంపై ఆమె మాట్లాడినట్లు తెలుస్తోంది. రూట్ మ్యాప్ తోపాటు వివిధ అంశాలపై మరోసాకరి చర్చించే అవకాశం ఉంది.