BRS: బీఆర్ఎస్ నేతలకు తృటిలో తప్పిన ప్రమాదం.. వీడియో రూపంలో మాట్లాడిన ఎమ్మెల్యే జోగురామన్న

కారు డివైడర్ ను ఢీకొట్టింది. అందులో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ దండే విఠల్, మాజీ ఎంపీ నగేశ్ ఉన్నారు.

BRS: బీఆర్ఎస్ నేతలకు తృటిలో తప్పిన ప్రమాదం.. వీడియో రూపంలో మాట్లాడిన ఎమ్మెల్యే జోగురామన్న

Konappa, Jogu Ramanna

BRS – Maharashtra: మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా (Yavatmal district) పాందరకవఢా మీదుగా వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జోగురామన్న (Jogu Ramanna), కోనేరు కోనప్ప (Konappa) కారుకి ప్రమాదం తప్పింది. సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న కార్యక్రమానికి వెళ్తున్న జోగురామయ్య, కోనేరు కోనప్ప కారుకు రోడ్డుపై పశువులు అడ్డువచ్చాయి.

దీంతో వాటిని తప్పించబోయి డివైడర్ ను ఢీకొట్టింది ఎమ్మెల్యే కారు. కారులో ఎమ్మెల్సీ దండే విఠల్, మాజీ ఎంపీ నగేశ్ కూడా ఉన్నట్లు సమాచారం. కారులో ఉన్న వారంతా సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం సీఎం కేసీఆర్ సభకు వారు మళ్లీ బయలుదేరి వెళ్లారు.

అనంతరం నాగ్‌పూర్ చేరుకున్నారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ విస్తరణపై బీఆర్‌ఎస్‌ దృష్టిసారించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ నాగ్‌పూర్‌ లో పార్టీ శాశ్వత కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నారు. నాగ్‌పూర్‌ రహదారులను గులాబీ జెండాలు నింపేశారు.

ప్రమాదం గురించి జోగు రామన్న వీడియో రూపంలో మాట్లాడారు. ” నాగ్ పూర్ లో జరిగే కేసీఆర్ సమావేశానికి హాజరవుతున్న సందర్భంగా రోడ్డుమీద ఆకస్మికంగా పశువులు అడ్డం రావడంతో చిన్న రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అందరూ క్షేమంగా ఉన్నారు. కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందవలసినవసరం లేదు ” అని చెప్పారు.

JP Nadda: తెలంగాణలో పర్యటించనున్న జేపీ నడ్డా.. అమిత్ షా పర్యటనపై కూడా బీజేపీ స్పందన