Jurala: జూరాలకు భారీగా వరద నీరు

జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద మొదలైంది. ఈ సీజన్‌లో అత్యధిక ఇన్ ఫ్లో కనిపిస్తుందని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 27వేల 400 క్యూసెక్కుల వరద నీరు చేరుకుంది. జూన్ మొదటి వారంలోనే ఈ స్థాయిలో వరద నీరు రావడం ఇదే తొలిసారి.

Jurala: జూరాలకు భారీగా వరద నీరు

Jurala

Jurala: జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద మొదలైంది. ఈ సీజన్‌లో అత్యధిక ఇన్ ఫ్లో కనిపిస్తుందని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 27వేల 400 క్యూసెక్కుల వరద నీరు చేరుకుంది. జూన్ మొదటి వారంలోనే ఈ స్థాయిలో వరద నీరు రావడం ఇదే తొలిసారి.

జూరాల క్యాచ్‌మెంట్ ఏరియాలో కురుస్తోన్న వర్షాలతో వరద కొనసాగుతోంది. దాంతోపాటు కృష్ణా నదిపై ఎగువనున్న ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది.

ఎగువన ఆల్మట్టి డ్యామ్‌కు 16వేల 300 క్యూసెక్కులు , నారాయణపూర్ ప్రాజెక్టుకు 8వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి.