Constables Triple Riding : ఫోన్ మాట్లాడుతూ..ఒకే స్కూటీపై మహిళా కానిస్టేబుల్స్ ట్రిపుల్ రైడింగ్, నో హెల్మెట్స్ ..

Constables Triple Riding : ఫోన్ మాట్లాడుతూ..ఒకే స్కూటీపై మహిళా కానిస్టేబుల్స్ ట్రిపుల్ రైడింగ్, నో హెల్మెట్స్ ..

Three Women Conistbles Break The Traffic Rules (1)

Three women conistbles Break the traffic rules: ట్రాఫిక్ రూల్స్ కేవలం ప్రజలకేనా? పోలీసులకు వర్తించవా? నో రూల్స్ .. నో హెల్మెట్స్ అన్నట్లుగా ఉంది ఈ ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లు వ్యవహరించిన తీరు చూస్తే. వాహనం నడిపేవారే కాదు వెనుక కూర్చున్నవారు కూడా హెల్మెట్ పెట్టుకోవాలనేది రూల్. కానీ ప్రజలకు రూల్స్ గురించి చెప్పే పోలీసులే ఆ నిబంధనల్ని ఉల్లంఘిస్తే..జనాలకు జరిమానాలు వేసే పోలీసులకు జరిమానాలు ఉండవా? ఉంటాయి. ఉండాల్సిందే కూడా.

అలా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసి..ఒకే స్కూటీపై ముగ్గురు మహిళా కానిస్టేబుల్స్ ప్రయాణించిన దానికి ఫలితంగా వారికి జరిమానా విధించిన ఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో జరిగింది. పైగా ఆ ముగ్గురు కానిస్టేబుల్స్ హెల్మెట్ కూడా పెట్టుకోలేదు. ఆఖరికి స్కూటీ డ్రైవ్ చేసే కానిస్టేబుల్ కూడా హెల్మెట్ పెట్టుకోలేదు. వీరిలో ఇద్దరూ కానిస్టేబుల్స్ సెల్ ఫోన్ మాట్లాడుతున్నారు. దీనికి ఫలితంగా వారిపై శాఖపరమైన చర్యలకు ఆదేశించారు. చార్జి మెమోలు జారీ చేశారు. ఈ కరోనా సమయంలో కూడా ఇలా వ్యవహరించటం ఎంత వరకూ సమంజసం అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు.

కరోనా విలయతాండవం చేస్తున్న సందర్భంలో మాస్క్ లేని వారికి కూడా రూ.వెయ్యి ఫైన్ విధించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. కానీ వాహనదారులు హెల్మెట్ పెట్టుకోవడం, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం నేరం అని చెప్పే పోలీసులే దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్న ఘటన ఖమ్మంలోని స్టేషన్ దారిలో చోటుచేసుకుంది. ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లు ఒకే టూ వీలర్ బండిపై వెళ్తూ.. ఎన్ని ట్రాఫిక్ నిబంధనలు బ్రేక్ చేశారో చూస్తే ఇక సామాన్య ప్రజలకు వీళ్లేం మెసేజ్ ఇస్తున్నారనే ప్రశ్నలు వస్తున్నాయి. అందులోని ఇద్దరూ సెల్ ఫోన్ మాట్లాడుతున్నారు. అంతేకాదు..మధ్యలో కూర్చున్న మహిళా కానిస్టేబుల్ డ్రైవింగ్ చేస్తున్న మరో కానిస్టేబుల్ చెవిలో ఫోన్ పెట్టి మాట్లాడేందుకు సహకరిస్తోంది. అంతేకాదండోయ్..వీరి ముగ్గురిలో ఎవ్వరికీ హెల్మెట్ లేదు. కనీసం స్కూటీ డ్రైవ్ చేసే కానిస్టేబుల్ కూడా హెల్మెట్ పెట్టుకోలేదు. వైరల్ గా మారిన ఫొటో పై సీపీ వారియర్ సీరియస్ అయ్యారు.

ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన మహిళ కానిస్టేబుల్ కు బారీ జరిమానా విధించాలని ఆదేశించారు. ఫిబ్రవరి 9 వ తేదిన వైఎస్ షర్మిలా సంకల్ప సభకు హజరైయ్యేందుకు TS04FD0822 నెంబరు గల ద్విచక్ర వాహనంపై ముగ్గురు మహిళ కానిస్టేబుల్స్ వెళ్తున్నట్లు నగరంలోని ఆనంద్ విహార్ సెంటర్ వద్ద వున్న సీసీ కెమెరాలలో గుర్తించారు.

ఖమ్మం సిటీ ఆర్ముడ్ రిజర్వ్ విభాగానికి చెందిన మహిళా కానిస్టేబుల్, మరో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లతో కలసి హెల్మెట్ లేకుండా ట్రిపుల్ రైడింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, ప్రమాదకరమైన నిర్లక్ష్యపు డ్రైవింగ్ కింద ట్రాఫిక్ పోలీసులు రూ. 3300/- జరిమానా విధించారు. ట్రిపుల్ రైడింగ్ పై సీరియస్ అయిన పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్ బాధ్యతారాహితంగా వ్యవహరించిన ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లపై శాఖపరమైన చర్యలకు ఆదేశించారు. ముగ్గురికీ చార్జి మెమోలు జారీ చేశారు.