Minister gangula: తెలంగాణపై కిషన్ రెడ్డి విషం చిమ్ముతుండు.. ఒక్క గింజకూడా పక్కదారి పట్టదు..

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచి తెలంగాణపైనే విషం చిమ్ముతున్నారని, ప్రజల ఓట్లతో గెలుపొంది కేంద్రం మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేయటం ..

Minister gangula: తెలంగాణపై కిషన్ రెడ్డి విషం చిమ్ముతుండు.. ఒక్క గింజకూడా పక్కదారి పట్టదు..

Gagula Kamalakar

Minister gangula: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచి తెలంగాణపైనే విషం చిమ్ముతున్నారని, ప్రజల ఓట్లతో గెలుపొంది కేంద్రం మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేయటం సరికాదని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గురువారం మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బియ్య మాయం అవుతుందనడం విడ్డూరమని, వడ్లను బియ్యంగా మార్చేది కేంద్ర ప్రభుత్వమేనని కిషన్ రెడ్డి తెలుసుకోవాలని అన్నారు.

Gangula Kamalakar: బీజేపీ వాళ్లు ఢిల్లీలో ధర్నా చెయ్యాలి.. బియ్యం కేంద్రమే కొనాలి -మంత్రి గంగుల

వడ్లను బియ్యంగా మార్చేది కేంద్ర ప్రభుత్వమేనని, రైతుల వద్ద వడ్లు కొనేది రాష్ట్ర ప్రభుత్వమని అన్నారు. కొనుగోలు కేంద్రాల నుండి రైస్‌మిల్‌కు పంపించి బియ్యంగా మార్చి ఎఫ్‌సిఐ‌కి పంపితే అప్పుడు కేంద్ర ప్రభుత్వం డబ్బులిస్తందని అన్నారు. అది కూడా తెలియకుండా రాష్ట్ర పరిధిలో ఉన్న రైస్ మిల్లులుపై దాడి చేస్తామనడం విడ్డూరంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో రబీ, ఖరీఫ్‌ సీజన్లు కలిపి 40.50 కోట్ల బస్తాల ధాన్యం సేకరిస్తే.. 4.52 లక్షల బస్తాలు కనిపించడం లేదని కేంద్రం చెబుతోందని, అది తప్పుడు లెక్కలని మంత్రి పేర్కొన్నారు.

Minister Gangula : వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై మంత్రి గంగుల ఆదేశాలు

ధాన్యం కొనుగోళ్లు, బియ్యం సేకరణ విషయంలో కేంద్రం సహకరించడం లేదని, తిరిగి మాపై నిందలువేస్తోందని ఆరోపించారు. ఎఫ్‌సీఐఆర్ అధికారులు వడ్ల బస్తాలు లెక్కపెట్టమంటే బియ్యం బస్తాలు లెక్కపడుతున్నారని విమర్శించారు. కిషన్ రెడ్డి ఫియూష్ గోయల్ కన్నా హేళనగా మాట్లాడుతున్నారని మంత్రి అన్నారు. రాష్ట్రంలో 50లక్షల మెట్రికట్ టన్నులు సేకరిస్తే, కర్ణాటకలో 12వేలు మాత్రమే సేకరించారని అన్నారు. స్కాం జరిగిందని అన్నారని, సీబీఐకి రాశారు, దర్యాప్తు చేపించండి అంటూ గంగుల పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా వడ్లపై వెరిఫై చేయలేదని, కానీ తెలంగాణపై దాడి చేయటం ఏమిటని గంగుల కమలాకర్ ప్రశ్నించారు.