Konda On New Party : తెలంగాణలో కొత్త పార్టీ..? కొండా విశ్వేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్, బీజేపీల ఢిల్లీ నాయకత్వం సరిగా లేదన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రాంతీయ పార్టీ ఉంటే బాగుండు అనే ఆలోచన చాలా మందిలో ఉందన్నారు.

Konda On New Party : పార్టీ మార్పుపై మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే నెలలో ఏ రాజకీయ పార్టీలో చేరాలనే దానిపై నిర్ణయం ప్రకటిస్తానని అన్నారు. అంతేకాదు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి త్వరలో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని అన్నారు. ప్రజల్లో టీఆర్ఎస్ పై వ్యతిరేకత ఉందన్న కొండా.. గట్టిగా పోరాడే పార్టీలో చేరుతానని ప్రకటించారు.
రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీలు కేసీఆర్ కుటుంబ పాలనపై బలంగా కొట్లాడుతున్నాయని చెప్పారు. కానీ, ఆ పార్టీల ఢిల్లీ నాయకత్వం సరిగా లేదన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రాంతీయ పార్టీ ఉంటే బాగుండు అనే ఆలోచన చాలా మందిలో ఉందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కూడా రాష్ట్ర రాజకీయాలపైనే చర్చించినట్లు కొండా విశ్వేశ్వర్ రెడ్డి వెల్లడించారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిది, నాది ఒకే లక్ష్యం అన్నారు. అదే సమయంలో ఆయన మరో బాంబు పేల్చారు. చాలా మంది కీలక నేతలు కాంగ్రెస్ వీడతారని అన్నారు.
Rahul Gandhi : టీఆర్ఎస్తో పోరాటమే, పొత్తులుండవు-రాహుల్ గాంధీ
కాగా, గత రెండు రోజులుగా వరుసగా బీజేపీ నేతలను కలుస్తున్న విశ్వేశ్వర్ రెడ్డి.. రాజకీయంగా హల్ చల్ చేస్తున్నారు. మహా పాదయాత్రలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ను కలవడం హాట్ టాపిక్ అయ్యింది. కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది.
కొండా బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం నడుస్తుండగా కొండా కీలక ప్రకటన చేశారు. వచ్చే నెలలో తాను ఏ రాజకీయ పార్టీలో చేరాలనే దానిపై నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు.
Revanth Reddy : కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టే : రేవంత్ రెడ్డి
కాగా, టీఆర్ఎస్లో చేరి ఎంపీగా గెలిచిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఆ పార్టీ నుంచి కూడా బయటకు వచ్చిన ఆయన కొంతకాలంగా సైలెంట్ గా ఉండిపోయారు. ఏ రాజకీయ పార్టీలో చేరనప్పటికీ.. రాజకీయంగా తన ప్రయాణాన్ని మాత్రం ఆపలేదు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ.. మీడియాతో మాట్లాడుతూ వచ్చారు. హుజూరాబాద్ ఎన్నికల్లో ఈటెల రాజేందర్‌కు బహిరంగంగానే మద్ధతు ప్రకటించారు. ప్రస్తుతం తెలంగాణలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన మళ్లీ యాక్టీవ్ అయ్యారు. తన పొలిటికల్ కెరియర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. మరి కొండా.. ఏ పార్టీలో చేరతారో అధికారికంగా క్లారిటీ రావాలంటే మరికొంతకాలం ఎదురు చూడాల్సిందే.
- కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ స్ట్రాంగ్ వార్నింగ్
- Rahul Gandhi : సోనియా కృషివల్లే తెలంగాణ.. అధికారంలోకి వస్తే హామీలన్నీ నెరవేరుస్తాం : రాహుల్
- Rahul Gandhi : టీఆర్ఎస్తో పొత్తుపై రాహుల్ విసుర్లు.. కాంగ్రెస్ నేతలకు హెచ్చరిక..!
- రాహుల్ రాకతో టీ-కాంగ్రెస్ రాతమారుతుందా..!
- Revanth reddy: అప్పుడు మీరెక్కడున్నారు? కవిత, కేటీఆర్ ట్వీట్లకు కౌంటర్ ఇచ్చిన రేవంత్‌రెడ్డి..
1Telangana Covid Update Report : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే
2Chandrababu Letter To Stalin : ఏపీ రేషన్ రైస్ మాఫియా.. తమిళనాడు సీఎం స్టాలిన్‌కు చంద్రబాబు లేఖ
3Taneti Vanitha On Ananthababu : సుబ్రమణ్యం హత్య కేసు.. సీఎం జగన్ న్యాయం పక్షాన నిలబడ్డారన్న హోంమంత్రి
4AP MDC: అమెరికా బారైట్ మార్కెట్ పై ఏపీ ఎండీసీ ద్రుష్టి: 3 కంపెనీలతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ
5Mumbai : మహిళతో శృంగారం చేస్తుండగా వృధ్దుడు మృతి
6Offline UPI: ఆఫ్ లైన్ యూపీఐ పేమెంట్ ఎలా చేయాలో తెలుసా..
7Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట 11 డేస్ కలెక్షన్స్.. సెంచరీ కొట్టిన మహేష్!
8Harmonium in Golden temple: అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో హార్మోనియం వినియోగించరాదన్న మత పెద్దలు
9Afghanistan: మహిళా యాంకర్ల కోసం మాస్కులతో మగ న్యూస్ రీడర్లు
10Revanth Reddy In Lakshmapur : కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక లక్ష్మాపూర్ భూ సమస్యను పరిష్కరిస్తాం-రేవంత్ రెడ్డి
-
Sekhar: ‘శేఖర్’ సినిమా వివాదంలో జీవితా రాజశేఖర్ గెలుపు
-
Allari Naresh: మారేడుమిల్లిలో టీచర్ జాబ్ కొట్టేసిన అల్లరి నరేశ్
-
Tirumala Temple: శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆగష్టు నెల కోటా రేపు విడుదల
-
KTM RC390: కేటీఎం ఆర్సీ 390 2022 మోడల్ని విడుదల చేసిన బజాజ్
-
Self Determination : పిల్లలకు స్వీయ నిర్ణయశక్తి అవసరమే!
-
Acidic Foods : అమ్లగుణంతో కూడిన ఆహారాలు తింటే దంతాలు పచ్చగా మారతాయా?
-
Akasa Airlines: రాకేశ్ ఝున్‌జున్‌వాలా ‘ఆకాశ ఎయిర్’ మొదటి బ్యాచ్ విమానాలు సిద్ధం: జులైలోనే సేవలు
-
Naga Chaitanya: మే 25న థ్యాంక్ యూ చెప్పనున్న చైతూ!