Rahul Gandhi : టీఆర్ఎస్‌తో పోరాటమే, పొత్తులుండవు-రాహుల్ గాంధీ

భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీతో పొత్తులు ఉండవని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలను మోసం చేసిన వారితో ఎలాంటి పొత్తులు ఉండవని చెప్పారు. తెలంగాణలో నియంతృత్వ, నిరంకుశ పాలన పోయి ప్రజాపాలన రావాలని ఆయన ఆకాంక్షించారు.

Rahul Gandhi : టీఆర్ఎస్‌తో పోరాటమే, పొత్తులుండవు-రాహుల్ గాంధీ

Rahul Gandhi

Rahul Gandhi : భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీతో పొత్తులు ఉండవని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఈరోజు ఆయన గాంధీ భవన్ లో జరిగిన  కాంగ్రెస్ పార్టీ  విస్తృత స్ధాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ…. తెలంగాణ ప్రజలను మోసం చేసిన వారితో ఎలాంటి పొత్తులు ఉండవని చెప్పారు. తెలంగాణలో నియంతృత్వ, నిరంకుశ పాలన పోయి ప్రజాపాలన రావాలని ఆయన ఆకాంక్షించారు.

టీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని… గత 8 ఏళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనకు చరమగీతం పాడుదామమని ఆయన అన్నారు. రాష్ట్రంలోని తెలంగాణ ప్రజల ఆకాంక్ష  మేరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని రాహుల్ చెప్పారు. తాము అధికారంలోకి వస్తేరైతు ఫ్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.   విద్యా,వైద్యం ఉపాధి రంగాలపై దృష్టి పెడతామని.. ఇది మన  లక్ష్యం అని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

వచ్చే ఎన్నికల్లో మెరిట్ ఆధారంగా టికెట్లు ఇవ్వబడతాయని…ఎవరూ   భ్రమలో  ఉండకండి అని హెచ్చరించారు. రైతుల కోసం, ప్రజల కోసం, చిరు వ్యాపారుల కోసం, కార్మికుల పక్షాన, పేదల పక్షాన పోరాటం చేసేవారికి టికెట్లు ఇవ్వబడతాయని రాహుల్ గాంధీ చెప్పారు. ఇది కాంగ్రెస్ కుటుంబం ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తామని చెప్పారు. పని చేయండి ప్రతిఫలం ఉంటుందని రాహుల్ అన్నారు. పార్టీలో ఎన్నేళ్ల సీనియర్లు ఐనా, ఎన్ని  సంవత్సరాలుగా పార్టీలో ఉన్నా  పని చేయకపోతే టికెట్ ఇచ్చే ప్రసక్తి లేదని ఆయన చెప్పారు.

గ్రౌండ్ రిపోర్టు ఆధారంగా, స్వతంత్ర సంస్ధ ద్వారా వ్యక్తిగత ఫీడ్ బ్యాక్ తీసుకుని టికెట్లు ఇవ్వబడతాయని… ఎవరైతే ప్రజల కోసం పనిచేస్తారో వారికి టికెట్లు ఇస్తామని రాహుల్ గాంధీ తెలిపారు. వరంగల్ డిక్లరేషన్ గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన గురుతర బాధ్యత ప్రతి కార్యకర్తపైనా ఉందని….తెలంగాణలోని 12 ఏళ్ల పిల్లవాడికి కూడా తెలంగాణ డిక్లరేషన్ గురించి చెప్పాలని కార్యకర్తలకు, నాయకులకు సూచించారు. వచ్చే నెలరోజుల్లో ప్రతినాయకుడు వారి వారి నియోజక వర్గాలలో ఈ కార్యక్రమం చేపట్టాలన్నారు.

పార్టీలో ఏదైనా ఇబ్బందులు ఉంటే మీడియాకు ఎక్కవద్దని…మనం మనం కూర్చుని మాట్లాడుకుందాం. వివాదాలు ఉంటే పరిష్కరించుకుందాం అని హితవు పలికారు. సమాజంలో యువత, ప్రజలు కాంగ్రెస్ పార్టీ సిధ్ధాంతాలు విధి విధానాలను మెచ్చే వాళ్లు ఉన్నారు. అలాంటి వాళ్లందరినీ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వనించేందుకు మన పార్టీ తలుపులు ఎప్పడూ తెరిచే ఉంచాలన్నారు.

Also Read :M K Stalin: స్టాలిన్ ఏడాది పాలన పూర్తి.. కొత్త పథకాల ప్రకటన