Digital Survey : తెలంగాణలో జూన్ 11 నుంచి భూముల డిజిట‌ల్ స‌ర్వే..

తెలంగాణ‌లో జూన్ 11 నుంచి భూముల డిజిట‌ల్ స‌ర్వే చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసింది. దీని కోసం రాష్ట్రంలోని 27 గ్రామాలను ఎంపిక చేసి ఆ గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద భూముల డిజిటల్ సర్వే చేపట్టాలని ఆదేశించారు. దీంట్లో భాగంగా ముందుగా వ్యవసాయం భూములు ఆ తరువాత పట్టణ ప్రాంతాల్లోని భూముల్ని సర్వే చేయాలని తెలిపారు. డిజిటల్ సర్వే కోసం గజ్వేల్ నియోజకవర్గంలోని మూడు గ్రామాలు, మిగిలిన 24 జిల్లా గ్రామాలను ఎంపిక చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

Digital Survey : తెలంగాణలో జూన్ 11 నుంచి భూముల డిజిట‌ల్ స‌ర్వే..

Digital Survey

lands Digital Survey In Telangana : తెలంగాణ‌లో జూన్ 11 నుంచి భూముల డిజిట‌ల్ స‌ర్వే చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసింది. దీని కోసం రాష్ట్రంలోని 27 గ్రామాలను ఎంపిక చేసి ఆ గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద భూముల డిజిటల్ సర్వే చేపట్టాలని ఆదేశించారు. దీంట్లో భాగంగా ముందుగా వ్యవసాయం భూములు ఆ తరువాత పట్టణ ప్రాంతాల్లోని భూముల్ని సర్వే చేయాలని తెలిపారు. డిజిటల్ సర్వే కోసం గజ్వేల్ నియోజకవర్గంలోని మూడు గ్రామాలు, మిగిలిన 24 జిల్లా గ్రామాలను ఎంపిక చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. జిటల్ సర్వే నిర్వహణ అంశాన్ని చర్చించడానికి ప్రగతి భవన్‌లో బుధవారం (జూన్ 2,2021)సీఎం కేసీఆర్ డిజిటల్ సర్వే ఏజెన్సీల ప్రతినిధులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

భూత‌గాదాలు లేని తెలంగాణే ల‌క్ష్యంగా డిజిటల్ సర్వే కోసం ఆదేశాలు
ఈ సమావేశంలో సీఎం కెసిఆర్ మాట్లాడుతూ.. భూ తగాదాలు లేని తెలంగాణను నిర్మించే లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం డిజిటల్ సర్వే చేయించాలని నిర్ణయించామని తెలిపారు. రాష్ట్రంలోని వ్యవసాయ భూములను డిజిటల్ సర్వే చేసి..వాటికి కో ఆర్డినేట్స్ గుర్తించి తద్వారా పట్టాదారుల భూములకు శాశ్వత ప్రాతిపదికన రక్షణ చర్యలు చేపట్టాలనేదే ప్రభుత్వ ఉద్దేశ్యమని తెలిపారు. ప్రజల భూమి హక్కులను కాపాడాలనే ఉద్దేశ్యంతో చేపట్టిన ఈ డిజిటల్ సర్వేను సమర్ధవంతంగా నిర్వహించాలని సూచించారు.

ముందుగా వ్య‌వ‌సాయ భూముల స‌ర్వే..
డిజిటల్ పైలట్ సర్వేలో భాగంగా ముందుగా వ్యవసాయ భూముల్లో సర్వే జరుగుతుందని..అనంతరం అటవీ భూములు ప్రభుత్వ భూములు కలిసి వున్న గ్రామాలల్లో నిర్వహించాలని అంటే..సమస్యలు లేని గ్రామాల్లోను..సమస్యలున్న గ్రామాల్లో మిశ్రమంగా సర్వే నిర్వహించి క్షేత్రస్థాయిలో వచ్చిన అనుభవాలను క్రోడీకరించుకుని ఆ తరువాత పూర్తి స్థాయి సర్వేకు విధి విధానాలను రూపొందించుకోవాలని సూచించారు. ముందుగా వ్యవసాయ భూముల సర్వే చేపట్టాలని..అవి పూర్తి అయ్యాక పట్టణ భూముల సర్వే చేపట్టాలని తెలిపారు.