సాగర్ భేరి : కేసీఆర్ స్పీచ్..హైలెట్స్, కాంగ్రెస్, బీజేపీలపై ఫైర్

సాగర్ భేరి : కేసీఆర్ స్పీచ్..హైలెట్స్, కాంగ్రెస్, బీజేపీలపై ఫైర్

Nellikkal Lift Irrigation Project : తెలంగాణలో మరోసారి ఎన్నికల వేడి రాజుకుంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక, పట్టభద్రుల మండలి ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఇప్పటి నుంచే టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. సాగర్ నియోజకవర్గం సిట్టింగ్ సీటు కావడంతో… ఆ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు అధికార పార్టీ వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగా…జిల్లాలో సీఎం కేసీఆర్ బుధవారం పర్యటించారు. మధ్యాహ్నం 12.30 గంటలకు నెల్లికల్లు ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం.. హాలియాలో టీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ప్రతిపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

హైలెట్స్ : –
తెలంగాణ ఉద్యమంలోనూ కాంగ్రెస్ ముందుకు రాలేదు.
అవినీతిరహితంగా పాలన చేస్తుంటే..ఓర్వలేక అవాకులు చెవాకులు పేలుతున్నారు.
ఉద్యమాల్ని చేసిన వారిని అవమానపర్చారు.
కాంగ్రెస్ నేతలు రైతు బంధులు కాదు..రాబంధులు.
రాక్షసులతో కొట్లాడాం. మీరో లెక్కా.

నాది అవినీతి రహిత ప్రభుత్వం.
చంద్రబాబు ఉన్నప్పుడు నీళ్లు ఆపితే..ఎవరూ నోరెత్తలేదు.
అన్యాయం జరిగినప్పుడు కాంగ్రెస్ నేతలు కనీసం మాట్లాడలేదు.
టీఆర్ఎస్ చేసిన కార్యక్రమాలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా ?

కళ్యాణ లక్ష్మి ఎక్కడైనా ఉందా ? కేసీఆర్ కిట్టు ఎక్కడైనా ఉందా ?
మీది దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం. దీని కోసమేనా పొలం బాట పట్టారు ?
భూ సమస్యలు లేని రాష్ట్రంగా తెలంగాణ మారబోతోంది.
ప్రాజెక్టులన్నీ ఆంధ్రాకు అనుకూలంగా కడుతుంటే..కాంగ్రెస్ నోర్మూసుకుంది.

మిషన్ కాకతీయతో 45 వేల చెరువుల్ని పునరుద్ధరించాం.
ఇండియాలోనే భూ పంచాయతీలు లేని రాష్ట్రంగా తెలంగాణ మారబోతోంది.
ఇప్పటిదాక 3.70 లక్షల మందికి గొర్రెలు పంపిణీ చేశాం.
ఈ ఏడాది 2 లక్షల కుటుంబాలకు..వచ్చే ఏడాది మరో 2 లక్షల కుటుంబాలకు ఇస్తాం.

ఏడాదికి రూ. 15 వేల కోట్లు రైతు బంధు ద్వారా అందిస్తున్నాం.
మాది క్లీన్ గవర్నమెంట్, మా పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారు.
వచ్చే బడ్జెట్ లో స్థానిక సంస్థలకు నిధులు మంజూరు చేస్తాం.
బీజేపీ నేతలు కొత్త బిచ్చగాడిలో మాట్లాడుతున్నారు.

బీజేపీ నేతలకు ప్రజలే బుద్ధి చెబుతారు.
పార్టీలు, నాయకత్వాలు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలి.
హద్దు మీరితే ఏం చేయాలో మాకు తెలుసు.
మేం చాలా మందితో కొట్లాడం..వీళ్లు మాకో లెక్క కాదు.

పదవులు, స్వార్థం కోసం తెలంగాణను బలిపెట్టారు.
ప్రాజెక్టలన్నీ ఆంధ్రాకు అనుకూలంగా కడుతుంటే..కాంగ్రెస్ నోర్మూసుకుంది.
వచ్చే బడ్జెట్ లో దళితుల కోసం ప్రత్యేక పథకం తీసుకొస్తాం.
సీఎం దళిత్ ఎంపవర్ మెంట్ పథకానికి వెయ్యి కోట్లు.

ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మాత్రమే ఓటు అడిగే హక్కు ఉంది.
నేను చెప్పేవి నిజాలైతే..టీఆర్ఎస్ ను గెలిపించండి.
నా మాటల్లో ఒక్క అబద్ధం ఉన్నా..ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించండి. అంటూ సీఎం కేసీఆర్ వెల్లడించారు.