ఎల్ఈడీ బల్బును మింగిన బాలుడు, పది నిమిషాల్లో బయటకు తీసిన డాక్టర్లు

ఎల్ఈడీ బల్బును మింగిన బాలుడు, పది నిమిషాల్లో బయటకు తీసిన డాక్టర్లు

led bulb removed lungs : ఎల్ఈడీ బల్బు (LED Bulb)తో ఆడుకుంటూ..ప్రమాదవశాత్తు దానిని మింగేశాడు 9 ఏళ్ల బాలుడు. దానిని బయటకు తీయలేక తీవ్ర అవస్థలు పడ్డాడు. దగ్గుతో అల్లాడిపోయాడు. చివరకు కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా..నోటి నుంచే బల్బును బయటకు తీశారు. కేవలం పది నిమిషాల్లోనే ఈ ఆపరేషన్ ను సక్సెస్ ఫుల్ గా ముగించారు.

వివరాల్లోకి వెళితే…

మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రకాష్ (9).. బాలుడు ఆదివారం ఎల్ఈడీ బల్బుతో ఆడుకుంటున్నాడు. స్నేహితులతో ఆడుకుంటున్న క్రమంలో..ఆ బల్బును నోట్లో పెట్టుకున్నాడు. ఆడుకుంటూ  ప్రమాదవశాత్తు…దానిని మింగేశాడు. బయటకు తీసేందుకు ఎంతో ప్రయత్నించాడు. కానీ సాధ్యం కాలేదు. దగ్గు, శ్వాస ఆగకపోవడంతో తీవ్ర అవస్థ పడ్డాడు. కుటుంబసభ్యులకు తెలిసి..అల్లాడిపోయారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. స్కానింగ్ తీయగా..ఎల్ఈడీ బల్బు కనిపించింది. శ్వాసనాళంలో ఊపిరితిత్తుల సమీపంలో దానిని గుర్తించారు. పీడీయాట్రిక్ రిజడ్ బ్రాంక్ స్కోపి చేసి ఆ బల్బును బయటకు తీశారు. ఇదంతా..కేవలం 10 నిమిషాల్లో పూర్తి చేశారు. అనంతరం అదే రోజు బాలుడిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోవడంతో..బాలుడి తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు.