CI Nageswara Rao : వివాహితపై అత్యాచారం కేసు.. కీచక ఖాకీపై సస్పెన్షన్ వేటు
మహిళలకు భద్రత కల్పించాల్సిన స్టేషన్ ఆఫీసరే మహిళపై అత్యాచారానికి ఒడిగట్టాడన్న ఆరోపణలు డిపార్ట్ మెంట్ లో కలకలం సృష్టించాయి. కిడ్నాప్, అత్యాచారం, ఆయుధాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కీచక ఖాకీపై వేటు పడింది.

Ci Nageswara Rao
CI Nageswara Rao : తెలంగాణ పోలీస్ డిపార్ట్ మెంట్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మహిళలకు భద్రత కల్పించాల్సిన స్టేషన్ ఆఫీసరే మహిళపై అత్యాచారానికి ఒడిగట్టాడన్న ఆరోపణలు డిపార్ట్ మెంట్ లో కలకలం సృష్టించాయి. కిడ్నాప్, అత్యాచారం, ఆయుధాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మారేడ్ పల్లి ఇన్ స్పెక్టర్ నాగేశ్వరరావుపై వేటు పడింది. నాగేశ్వరరావును సస్పెండ్ చేశారు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్.
Hyderabad : మహిళపై సీఐ అత్యాచారం, కిడ్నాప్
ఇప్పటికే నాగేశ్వరరావును అరెస్ట్ చేసిన వనస్థలిపురం పోలీసులు కాసేపట్లో రిమాండ్ కు తరలించనున్నారు. పోలీస్ డ్రెస్ వేసుకున్నాం కదా అని ఏం చేసినా అడిగేవారు ఉండరనుకున్నాడో ఏమో బరితెగించి ఇష్టారాజ్యంగా వ్యవహరించాడు మారేడ్ పల్లి సీఐ కె.నాగేశ్వరరావు. న్యాయం కోసం తన పోలీస్ స్టేషన్ కు వచ్చిన వ్యక్తిని వేధించడమే కాకుండా అతడి భార్యపై అత్యాచారం చేసినట్లుగా నాగేశ్వరరావుపై ఆరోపణలు ఉన్నాయి.
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw
2018లో ఓ కేసులో బాధిత వ్యక్తిని రిమాండ్ చేశాడు సీఐ నాగేశ్వరరావు. అప్పుడే అతడితో పరిచయం పెరిగిందన్నారు. ఇంటికి కూడా వెళ్లొద్దని, తన పొలం దగ్గర పని చేయాలని సీఐ తనకు కండీషన్స్ పెట్టాడని బాధితుడు ఆరోపించాడు. తాను లేని సమయంలో తన భార్యను బలవంతంగా పొలం వద్దకి తీసుకెళ్లడంతో గొడవ పడ్డానన్నాడు బాధితుడు.
హస్తినాపురంలో నివాసం ముండే మహిళపై ఈ నెల 7వ తేదీన రాత్రి 12 గంటలకు సీఐ నాగేశ్వరరావు అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అడ్డొచ్చిన ఆమె భర్తను గన్ తో బెదిరించాడు. అనంతరం దంపతులను బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లాడు. అయితే ఇబ్రహీంపట్నం చెరువుకట్ట వద్ద కారుకు యాక్సిడెంట్ కావడంతో బాధితులు తప్పించుకుని వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారుకి ప్రమాదం జరగకుండా ఉంటే తమను సీఐ చంపేసి ఎక్కడో చోట పడేసేవాడని బాధితులు వాపోయారు.
Jharkhand: స్కూల్ నుంచి ఇంటికెళ్తున్న బాలిక కిడ్నాప్, అత్యాచారం
నాగేశ్వరరావు గతంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా విధులు నిర్వహించారు. పుడింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసులో కీలకంగా వ్యవహరించిన నాగేశ్వరరావును అక్కడి నుంచి మారేడ్ పల్లి పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు.