Massive Data Theft : షాకింగ్.. ఏపీలో 2కోట్ల మంది, హైదరాబాద్‌లో 56లక్షల మంది డేటా చోరీ

మొత్తం 24 నగరాల్లో దాదాపు 4.5 లక్షల మంది ఉద్యోగులను నియమించి మరీ డేటాను దొంగిలిస్తున్నట్లు ఆధారాలు సేకరించారు.(Massive Data Theft)

Massive Data Theft : షాకింగ్.. ఏపీలో 2కోట్ల మంది, హైదరాబాద్‌లో 56లక్షల మంది డేటా చోరీ

Massive Data Theft : డేటా చోరీ కేసులో మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇవాళ సైబరాబాద్ పోలీసులు.. డేటా చోరీ కేసులో ప్రధాన నిందితుడు వినయ్ భరద్వాజ్ ను హర్యానాలో అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి దిమ్మతిరిగిపోయే విషయాలు పోలీసులు రాబట్టారు. 56లక్షల మంది హైదరాబాదీల డేటా చోరీ జరిగినట్లు గుర్తించారు. ఏపీ నుంచి 2కోట్ల 10లక్షల మంది వ్యక్తిగత వివరాలు చోరీ అయినట్లు గుర్తించారు. 9,10,11,12 తరగతుల విద్యార్థుల డేటా కూడా చోరీ అయినట్లు పోలీసులు గుర్తించారు.

66కోట్ల మంది భారతీయుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించిన కీలక నిందితుడిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వినయ్ భరద్వాజ్ అనే నిందితుడిని పోలీసులు హర్యానాలో అదుపులోకి తీసుకున్నారు. డేటా చోరీ కేసులో గతంలో అరెస్ట్ అయిన ఏడుగురు నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా మొత్తం తీగ లాగితే డొంక కదిలింది. డేటా చోరీ కేసులో పోలీసులు అన్ని ఆధారాలు సేకరించారు.

Also Read..Data Theft Case : డేటా చోరీ కేసులో సంచలనం.. 16కోట్లు కాదు ఏకంగా 66కోట్ల మంది డేటా అమ్మేశాడు, ప్రధాన నిందితుడు అరెస్ట్

తొలతు.. 16 కోట్ల మంది భారతీయుల డేటాను దొంగిలించారు అని అంతా అనుకున్నారు. కానీ, దర్యాఫ్తులో షాకింగ్ నిజాలు తెలిశాయి. ఏకంగా 66కోట్ల మంది వ్యక్తిగత సమాచారం చోరీ చేసినట్లు తెలియడంతో పోలీసులు సహా అంతా విస్తుపోతున్నారు. ఏ రాష్ట్రం ఎక్కువగా డేటాను దొంగిలించారు అనే విషయానికి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎక్కువగా డేటా చోరీ జరిగింది. అక్కడ 21.39 కోట్ల మంది డేటాను చోరీ చేశారు.

ఇక ఏపీ విషయానికి వస్తే 2.10 కోట్ల మంది డేటా దొంగిలించారు. ఛత్తీస్ ఘడ్, బీహార్, ఢిల్లీ వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యక్తుల డేటా చోరీ చేశారు. డేటా చోరీకి సంబంధించి రాష్ట్రాల వారీగా సైబరాబాద్ పోలీసులు క్లియర్ గా జాబితా ఇచ్చారు. ఇందులో యూపీ నెంబర్ 1 స్థానంలో ఉంది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే 56లక్షల మంది వ్యక్తిగత సమాచారం దొంగిలించారు.

Also Read..Data Theft Case: డేటా చోరీ కేసులో నమ్మలేని నిజాలు.. జస్ట్ డయల్‌కు నోటీసులిచ్చేందుకు సిద్ధమైన పోలీసులు

ఇందులో చాలావరకు డిఫెన్స్, ఆర్మీ అధికారుల డేటా ఉంది. డీ-మార్ట్, ఫోన్ పే, గూగుల్ పే, క్రెడిట్ కార్డ్, నీట్, ఇన్సూరెన్స్ కార్డ్స్, ఇన్ కమ్ ట్యాక్స్ నుంచి పెద్ద ఎత్తున డేటాను దొంగిలించినట్లు విచారణలో తెలిసింది. మొత్తం 24 నగరాల్లో 6 మెట్రోపాలిటిన్ సిటీస్ లో దాదాపు 4.5 లక్షల మంది ఉద్యోగులను నియమించి మరీ ఈ డేటాను దొంగిలిస్తున్నట్లు ఆధారాలు సేకరించారు.