Data Theft Case: డేటా చోరీ కేసులో నమ్మలేని నిజాలు.. జస్ట్ డయల్‌కు నోటీసులిచ్చేందుకు సిద్ధమైన పోలీసులు
డేటా చోరీ కేసుకు సంబంధించి విచారణను సైబరాబాద్ సిట్ అధికారులు ముమ్మరం చేశారు. ఆర్మీ వాళ్ళ డేటాసైతం అమ్మేస్తున్న జస్ట్ డయల్ కంపెనీపై చర్యలకు సిట్ దృష్టిసారించింది. జస్ట్ డయల్‌కు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమైయ్యారు.

Data Theft Case
Data Theft Case: దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న 16.8 కోట్ల మంది వ్యక్తిగత డేటా చోరీ కేసులో సైబరాబాద్ ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ మరింత లోతుగా విచారిస్తోంది. ఈ కేసులో విచారణను పోలీసులు ముమ్మరం చేస్తున్నాకొద్దీ నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. డేటా చోరీ కేసులో ఇప్పటికే ఏడుగురిని అరెస్టు చేశారు. నిందితులు డేటా ఎవరెవరికి విక్రయించారనే అంశంపై ఆరా తీస్తున్నారు. నిందితులను కస్టడీకి తీసుకుని ప్రశ్నించాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. గత ఏడాది కాలంగా నిందితులు ఈ దందా కొనసాగిస్తున్నట్లు గుర్తించిన సిట్ అధికారులు.. చైనా సైబర్ నేరగాళ్లకు డేటా చేరిందా అనే అంశంపైనా ఆరా తీస్తున్నారు.
Nallamothu Sridhar : డేటా చోరీ అంటే ఏమిటి? ఏ విధంగా తస్కరిస్తారు? పర్సనల్ డేటాను కాపాడుకోవడం ఎలా?
మరోవైపు జస్ట్ డయల్‌లో కుప్పలు తెప్పలుగా డేటా బేస్‌లు ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఎవరు ఫోన్ చేసినా డేటా బేస్ ఇచ్చేందుకు జస్ట్ డయల్ రెడీ అవుతుందని, జస్ట్ డయల్ వద్ద ఆర్మీ, విద్యార్థులు, రియల్ ఎస్టేట్, క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ డేటా బేస్ ఉన్నట్లు, రూ.4వేలు కడితే చాలు లక్షలాది మంది డేటాబేస్‌ను జస్ట్ డయల్ ఇచ్చేస్తున్నట్లు తెలిసింది. దీన్నే ఆసరాగా చేసుకుని 16 కోట్ల మంది డేటాను ముఠాను కొట్టేసినట్లు సిట్ అధికారులు భావిస్తున్నారు.
ఆర్మీ వాళ్ళ డేటాసైతం అమ్మేస్తున్న జస్ట్ డయల్ కంపెనీపై చర్యలకు సిట్ దృష్టిసారించింది. జస్ట్ డయల్‌కు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమైయ్యారు. ఇప్పటి వరకు డేటా చోరీ కేసులో పోలీసులు ఏడుగురని ఆరెస్ట్ చేశారు. త్వరలో జస్ట్ డైల్ వాట్సాప్, ఫేస్‌బుక్ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.