Rythubandhu Funds : రైతుబంధు నిధులను బకాయిల కింద జమ చేసుకుంటున్న బ్యాంకులు.. తెలంగాణ ప్రభుత్వం సీరియస్

రైతుబంధు నిధులను బకాయిల కింద జమ చేసుకోవడంపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయింది. రైతుబంధు నిధులను కొందరు బ్యాంకర్లు రుణాలు, ఇతర బకాయిల కింద జమ చేసుకోవడంపై ఆర్థిక మంత్రి హరీష్ రావు బ్యాంకులు పాత బకాయిల కింద జమ చేసుకోవడంపై విచారణకు ఆదేశించారు.

Rythubandhu Funds : రైతుబంధు నిధులను బకాయిల కింద జమ చేసుకుంటున్న బ్యాంకులు.. తెలంగాణ ప్రభుత్వం సీరియస్

HARISH

Rythubandhu funds  : రైతుబంధు నిధులను బకాయిల కింద జమ చేసుకోవడంపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయింది. రైతుబంధు నిధులను కొందరు బ్యాంకర్లు రుణాలు, ఇతర బకాయిల కింద జమ చేసుకోవడంపై ఆర్థిక మంత్రి హరీష్ రావు బ్యాంకులు పాత బకాయిల కింద జమ చేసుకోవడంపై విచారణకు ఆదేశించారు. దీనికి సంబంధించి విచారణ చేపట్టాలని ఆదేశించారు.

సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎల్ బీసీ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు. విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కోరారు. పంట పెట్టుబడి సాయాన్ని పాత బకాయిల కింద జమ చేయకుండా ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించాలని ఆదేశించారు. ఈ విషయమై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితిని ఆదేశించారు.

Telangana Marijuana : వారికి రైతు బంధు కట్… 148 మంది రైతులపై కేసులు

రైతుబంధు నిధులను ఎట్టి పరిస్థితుల్లోనూ బకాయిలకు జమ చేసుకోవద్దని సూచించారు. ఎస్ఎల్ బీసీ నిబంధనలను బ్యాంకర్లు విధిగా పాటించాలని పేర్కొన్నారు. పంట పెట్టుబడి సాయం కోసం రైతుబంధు ద్వారా రైతులకు ఇచ్చే నగదు మొత్తాన్ని వారి ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించారు.