Kishan Reddy : ధాన్యం కొనము అని మేము చెప్పామా? టీఆర్ఎస్ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి ఆగ్రహం

టీఆర్ఎస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి కేంద్రం, ప్రధాని మోదీపై పధకం ప్రకారం విష ప్రచారం మొదలుపెట్టారని..

Kishan Reddy : ధాన్యం కొనము అని మేము చెప్పామా? టీఆర్ఎస్ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి ఆగ్రహం

Kishan Reddy

Kishan Reddy : టీఆర్ఎస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి కేంద్రం, ప్రధాని మోదీపై పధకం ప్రకారం విష ప్రచారం మొదలుపెట్టారని మండిపడ్డారు. ధాన్యం, బియ్యం కొనుగోలుపై కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత దాన్ని ఇప్పుడు పెద్ద సమస్యగా సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పీయూష్ గోయల్ చాలా వివరంగా పార్లమెంట్ లో చెప్పారని, తాను అనేక సార్లు స్పందించానని తెలిపారు. మళ్లీ ఈరోజు ప్రకటన కావాలని టీఆర్ఎస్ అనడం మంచిది కాదన్నారు.

చేసుకున్న ఒప్పందం ప్రకారం.. రా రైస్, బాయిల్డ్ రైస్ కొంటామని భారత ప్రభుత్వం చెబుతోందన్నారు. భారత ప్రభుత్వం రైతులకు అన్యాయం చేయదని చెప్పారు. బాయిల్డ్ రైస్ కాకుండా రైతులకు ఇతర విత్తనాలు ఇవ్వండని కేంద్రం సూచించిందన్నారు. బాయిల్డ్ రైస్.. రైస్ మిల్లర్లు తయారు చేస్తున్నారని కిషన్ రెడ్డి చెప్పారు. కిసాన్ బచావో అన్నట్టు లేదు.. కేసీఆర్ బచావో అన్నట్లుగా టీఆర్ఎస్ తీరు ఉందన్నారు. టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు.

WhatsApp Trick : ఈ ట్రిక్ తెలిస్తే.. మీ వాట్సాప్​లో 256 కాంటాక్టులకు ఒకేసారి మెసేజ్​ పంపొచ్చు..!

హుజూరాబాద్ లో రైతులు బీజేపీకి ఓటు వేశారని, అందుకే బీజేపీకి వ్యతిరేక ప్రచారం టీఆర్ఎస్ చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసీఆర్ కుటుంబ సభ్యులంతా ఇందిరా పార్కులో ధర్నా చేశారని కిషన్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొంటుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్రం కొనుగోళ్లు ఆపదన్న కిషన్ రెడ్డి.. రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు.

ఫిబ్రవరిలో కూడా రైతులకు అన్యాయం జరగనివ్వం అని హామీ ఇచ్చారు. బాయిల్డ్ రైస్ కాకుండా రైతులకు ప్రత్యామ్నాయ విత్తనాలు ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తోందన్నారు. రా రైస్ ప్రతి గింజ కేంద్రం కొంటుందన్నారు. 44 లక్షల మెట్రిక్ టన్నులకి అదనంగా బాయిల్డ్ రైస్ కొంటున్నామని చెప్పారు. భయపడితే రైతులకు భయపడతాం తప్ప కేసీఆర్, టీఆర్ఎస్ కు కాదన్నారు కిషన్ రెడ్డి. కేసీఆర్ కు ఇకపై జాతి ప్రయోజనాలు అవసరం లేదని, కుటుంబ ప్రయోజనాలే అవసరమని విమర్శించారు.

Gas Problem : కడుపులో గ్యాస్ సమస్య, కారణాలు ఇవే..

ధాన్యం సేకరణకి కేంద్రమే ఖర్చు చేస్తుందన్నారు. దేశంలో యాసంగి టార్గెట్ ఏ రాష్ట్రానికి ఇవ్వలేదన్నారు. ఖరీఫ్ లో చేసుకున్న ఒప్పందం ప్రకారం, అంతకు మించి ఉన్నా చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రా రైస్ కొనుగోలు చేయము అని ఎప్పుడూ చెప్పలేదన్నారు.