Minister KTR : తెలంగాణలో కరవు లేదు, కర్ఫ్యు లేదు అభివృద్ధే ఉంది : మంత్రి కేటీఆర్

మేము ఏమి చేశామో చెప్పి ఓట్లు అడుగుతున్నాం..కానీ బీజేపీ తొమ్మిదేళ్లు దేశంలో అధికారంలో ఉండే ఏం చేసింది..? అని ప్రశ్నించారు. పేదరికంలో భారత్ ఆఫ్రికా దేశమైన నైజీరియాను దాటిపోయింది అంటూ కేంద్రంలో ఉన్న బీజేపీ పాలనపై విమర్శలు చేశారు. 11 సార్లు కాంగ్రెస్ కు ప్రజలు అవకాశం ఇచ్చినా చేసిందేమీ లేదన్నారు.

Minister KTR : తెలంగాణలో కరవు లేదు, కర్ఫ్యు లేదు అభివృద్ధే ఉంది : మంత్రి కేటీఆర్

Minister KTR

Minister KTR Fire On Congress and BJP : తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సొంత రాష్ట్రం ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అభివద్ధి చేశామని..దాన్ని చూసే ఓటు వేయాలని కోరుతోంది. కానీ బీఆర్ఎస్ ది అవినీతి పాలన..కుటుంబ పాలన అంటూ విపక్షాలు ఒక్కసారి తమకు అవకాశం ఇస్తే అభివృద్ది ఏంటో చూపిస్తామంటోంది. కానీ గులాబీ పార్టీ నేతలు మాత్రం పోరాడి సాధించుకుని అభివృద్ధి చేసుకుని మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన తెలంగాణను మోసకారుల చేతిలో పెట్టి కష్టాలు కొని తెచ్చుకోవద్దని సూచిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలను నమ్మొద్దని మరోసారి కేసీఆర్ ను సీఎంను చేసుకుని తెలంగాణను కాపాడుకోవాలని చెబుతున్నారు. దీంట్లో భాగంగా పోటా పోటీగా ఆయా పార్టీల నేతలు ప్రచారాల్లో విమర్శలు ప్రతి విమర్శలతో హోరెత్తిస్తున్నారు.

దీంట్లో భాగంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతు..కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా లేని విధంగా తెలంగాణ అభివద్ధిలో దూసుకుపోతోందని..రాష్ట్రంలో కరువు, కర్ఫ్యూ లేదు…దేశ వ్యాప్తంగా మీరు పరిస్థితి చూస్తున్నారు..అభివృద్ధే జరుగుతోందని దాన్ని చూసే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడకముందు ఎలా ఉంది..? ఇప్పుడు ఎలా ఉంది…బీఆర్ఎస్ పాలలో అభివృద్ది ఎలా ఉందో ప్రజలు ఆలోచిస్తే సమాధానం దొరుకుతుందని అన్నారు.

సమగ్ర, సమీకృత,సమ్మిళిత రాష్ట్రమే తెలంగాణ..దేశంలో ఎక్కడా జరుగని అభివృద్ధి ఇక్కడ జరిగింది తలసరి ఆదాయంలో దేశంలో మొదటి స్థానంలో ఉంది ..రాష్ట్రంలో కరువు, కర్ఫ్యూ లేదు…సమ్మిళిత అభివృద్ధి జరుగుతోంది అంటూ చెప్పుకొచ్చారు.ఏ పని చేసినా స్పష్టమైన ఏజండా తో ముందుకు వెళుతున్నామని ప్రధాని మోదీ చెబుతుంటారు..కానీకోవిడ్ తరువాత అత్యతదిక పేదలున్న దేశంగా మారిపోయింది అంటూ వివరించారు. సీఎం కేసీఆర్ పాలన సంక్షేమనికి స్వర్ణ యుగంగా మారిందన్నారు. ఐటీ కంపెనీలకు తెలంగాణ కేరాఫ్ అడ్రస్ గా నిలిచిందన్నారు. తెలంగాణలో 7.7 శాతం పచ్చదనం పెరిగిందన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ గా ఉందని అన్నారు.తెలంగానలో పల్లెలు, పట్టణ ప్రగతిలో కేంద్ర అవార్డులు వస్తున్నాయని అన్నారు. వివక్ష లేకుండా పాలన అందిస్తున్నామన్నారు.ఇప్పటికే 1.32 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని మరిన్ని ఉద్యోగాల కల్పన జరగాలంటే మరోసారి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.

Minister Puvvada Ajay Kumar : కేసీఆర్ కు మంత్రి పదవి ఇప్పించానన్న తుమ్మల వ్యాఖ్యలకు అజయ్ కుమార్ స్ట్రాంగ్ కౌంటర్

కేసీఆర్ అప్పులు తెచ్చి రాష్ట్ర అభివృద్ధి కోసం పెడుతున్నారని కానీ..కర్ణాటక లో ఐదు గంటల కరెంట్ ఇవ్వలేక అక్కడి ప్రభుత్వం అవస్థలు పడుతోంది అంటూ చెప్పుకొచ్చారు. దేశంలో 24 గంటల విద్యుత్ సరఫరా తెలంగాణ లో మాత్రమే ఉంది ఉందని ఈ విషయాన్ని గుర్తించాలని సూచించారు.కేసీఆర్ ప్రభుత్వం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధిలో సమతుల్యం పాటిస్తోందన్నారు. మేము ఏమి చేశామో చెప్పి ఓట్లు అడుగుతున్నాం..కానీ బీజేపీ తొమ్మిదేళ్లు దేశంలో అధికారంలో ఉండే ఏం చేసింది… అని ప్రశ్నించారు. పేదరికంలో భారత్ ఆఫ్రికా దేశమైన నైజీరియాను దాటిపోయింది అంటూ కేంద్రంలో ఉన్న బీజేపీ పాలనపై విమర్శలు చేశారు. కోవిడ్ వ్యాక్సిన్లకు తెలంగాణ ప్రపంచ రాజధానిగా ఎదిగింది అన్నారు. ఇక కాంగ్రెస్ గురించి చెప్పాలంటే..11 సార్లు కాంగ్రెస్ కు ప్రజలు అవకాశం ఇచ్చినా చేసిందేమీ లేదన్నారు.

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను వంచించింది అంటూ విమర్శించారు.1956లో ఇష్టం లేని పెళ్లి కాంగ్రెస్ చేసింది అంటూ ఉమ్మడి ఏపీ గురించి ప్రస్తావించారు.1968 లో తెలంగాణ ఉద్యమాన్ని అణగదొక్కిందికాంగ్రెసే అన్నారు. 1971లో తెలంగాణ ప్రజల తరపున మాట్లాడితే ఆ నేతలను అణగదొక్కారని అంటూ విమర్శించారు. ఆనాడు  ఎన్నో చెప్పారు… ఈ రోజు 6 గ్యారెంటీలు అంటున్నారు ఎంతో మంది పిల్లలను బలి తీసుకుంది కాంగ్రెస్ పార్టీ అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ తెలంగాణకు చేసిన పాపానికి తెలంగాణ 58 ఏళ్లు బాధపడింది అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతోంది అంటూ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ ను గెలిపించాలంటున్నారు. కానీ కాంగ్రెస్ స్వార్ధం కోసమే తెలంగాణ ఇచ్చింది అంటూ ఆరోపించారు.