Minister Puvvada Ajay Kumar : కేసీఆర్ కు మంత్రి పదవి ఇప్పించానన్న తుమ్మల వ్యాఖ్యలకు అజయ్ కుమార్ స్ట్రాంగ్ కౌంటర్

తుమ్మల అరాచకపు మాటలు మాట్లాడుతున్నాడని, తన విధానం సరైందికాదని పువ్వాడ సూచించారు. కేటీఆర్, అజయ్ లు గుండెలు కోసుకునేంత మిత్రులమని చెప్పారు.

Minister Puvvada Ajay Kumar : కేసీఆర్ కు మంత్రి పదవి ఇప్పించానన్న తుమ్మల వ్యాఖ్యలకు అజయ్ కుమార్ స్ట్రాంగ్ కౌంటర్

Puvvada Ajay Kumar

Updated On : October 28, 2023 / 12:19 PM IST

Assembly Elections 2023: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ కు అప్పట్లో మంత్రి పదవి ఇప్పించానంటూ తుమ్మల వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ పై తుమ్మల వ్యాఖ్యలు సరికాదని, నీచాతి నీచానికి తుమ్మల దిగజారి మాట్లాడుతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గంలో నా చేతిలో ఓడిపోయిన తరువాత తుమ్మలకు కేసీఆర్ రాజకీయ అవకాశం కల్పించకపోతే ఈనాటికీ తుమ్మల రాజకీయాల నుంచి రిటైర్ అయ్యేవారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో తుమ్మల లేడు.. జై తెలంగాణ అన్నవాళ్లను జైల్లో పెట్టించిన ఘనత తుమ్మలది అంటూ పువ్వాడ విమర్శించారు.

Also Read : Telangana Congress : కాంగ్రెస్ లో పెరుగుతున్న అసంతృప్తుల జాబితా.. టిక్కెట్ ఆశించి భంగపడ్డ నేతలు వీరే..

సీఎం కేసీఆర్ కు తుమ్మల మంత్రి పదవి ఇప్పించారా? ఇది నమ్మాలా.. కేసీఆర్ ఏనాడూ ఓటమి పాలుకాలేదు. టికెట్ లు ఇవ్వడానికి నీవేమైనా పార్టీ అధినేతనా? ముఖ్యమంత్రినా అంటూ తుమ్మలను పువ్వాడ అజయ్ ప్రశ్నించారు. నిజంగా నీకు అంతదమ్ముంటే టీడీపీలో మంత్రిగా ఉండి భక్తరామదాసు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. తుమ్మలను ఓడించడంకోసం కేటీఆర్ ప్రయత్నాలు చేశారన్న ఆరోపణ అర్ధరహితం. కందాళకు కేటీఆర్ డబ్బులు ఇప్పించారన్న మాటలు హాస్యాస్పదం అంటూ మంత్రి అన్నారు. మమతా మెడికల్ మా కష్టార్జితం. ప్రభుత్వ విధానంలో భాగంగా మమతను రెగ్యులేషన్ చేసుకున్నానని పువ్వాడ అన్నారు. నీ ఫార్మ్ హౌజ్ లు, పామాయిల్ తోటలు అన్ని ఎలా సంపాదించావు అంటూ పువ్వాడ ప్రశ్నించారు.

Also Read : Tummala Nageswara Rao : నేనే నీకు పదవి ఇప్పించా- సీఎం కేసీఆర్ విమర్శలకు తుమ్మల కౌంటర్

తుమ్మల అరాచకపు మాటలు మాట్లాడుతున్నాడని, తన విధానం సరైందికాదని పువ్వాడ సూచించారు. కేటీఆర్, అజయ్ లు గుండెలు కోసుకునేంత మిత్రులమని చెప్పారు. పార్టీ పిరాయించింది నీవు.. టీడీపీ, బీఆర్ఎస్ నేడు కాంగ్రెస్ లో చేరావు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తుమ్మల ఇప్పటికైన తన పద్దతి మార్చుకోవాలని పువ్వాడ సూచించారు. పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలేరు సభలో అన్నీ సత్యాలే చెప్పారు. నేను ఒక్క రూపాయి కాంట్రాక్టు తీసుకొని ఉంటే పాలేరు నుండి పోటీలో తప్పుకుంటా. నిరూపించాలి. ఎక్కడైనా చర్చకు నేను సిద్ధం.. మీరు సిద్ధమా అంటూ ప్రతిపక్ష నేతలకు కందాళ సవాల్ విసిరారు.