మనీ సర్క్యులేషన్ స్కామ్..రూ.1500 కోట్ల మోసం : కంపెనీ డైరెక్టర్లు సహా 24 మంది అరెస్ట్

మహానగరంలో ఈ భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. భాగ్యనరం కేంద్రంగా మొదలైన మోసానికి సంబంధించిన నిందితుల ఆట కట్టించారు సైబరాబాద్‌ పోలీసులు. భారీ మనీ సర్క్యూలేషన్ స్కీమ్ స్కామ్‌ను.. సైబరాబాద్ ఎకనామకిల్ ఆపన్స్ వింగ్ బయటపెట్టింది.

10TV Telugu News

Money circulation scam : మోసపోవడానికి మనం రెడీగా ఉంటే చాలు.. మోసం చేయడానికి క్యూలో నిలబడి మరీ వస్తారు. జనం మైండ్ సెట్ మారనంత కాలం.. ఈ కేటుగాళ్ల దందా మారదు. సామాన్య ప్రజల ఆశలను, ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకొని.. వాటిపైనే తమ కన్నింగ్ బిజినెస్ నడిపిస్తుంటారు. మల్టీలెవెల్ మార్కెటింగ్, ఆన్ లైన్ ట్రేడింగ్ పేరు చెప్పి.. కోట్లలో దోచుకుంటున్నారు. ఇప్పుడు.. హైదరాబాద్‌లో మరోసారి అలాంటి భారీ మోసమే బయటపడింది.

మహానగరంలో ఈ భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. భాగ్యనరం కేంద్రంగా మొదలైన మోసానికి సంబంధించిన నిందితుల ఆట కట్టించారు సైబరాబాద్‌ పోలీసులు. భారీ మనీ సర్క్యూలేషన్ స్కీమ్ స్కామ్‌ను.. సైబరాబాద్ ఎకనామకిల్ ఆపన్స్ వింగ్ బయటపెట్టింది. ఇండస్ వివా హెల్త్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ భారీ మోసానికి పాల్పడ్డట్లు గుర్తించారు పోలీసులు.

దేశ వ్యాప్తంగా 10 లక్షల మందిని మోసం చేసినట్టు తేల్చారు. మనీ స్కీమ్ గ్యాంగ్ దాదాపు 15వందల కోట్ల రూపాయల డబ్బు వసూలు చేసినట్లు తెలుస్తోంది. కంపెనీ డైరెక్టర్స్ తోసహా 24 మంది ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. వివా సంస్థకు సంబంధించి 20 కోట్ల రూపాయలను సీజ్‌ చేశారు.

ఈ మధ్య ఇటువంటి మనీ స్కీమ్‌లు వరుసగా బయటకొస్తున్నాయి. లోన్ల పేరుతో కొందరు మోసాలకు పాల్పడుతుంటే.. మరికొందరు ఆన్ లైన్ ట్రేడింగ్ పేరుతో జనాలకు టోకరా వేస్తున్నారు. ఆన్‌లైన్ ట్రేడింగ్ మనీ స్కామ్‌ పేరు చెప్పి.. సుమారు పది లక్షల మందిని మోసం చేసి పదిహేను వందల కోట్ల రూపాయలు దోచేశారు కేటుగాళ్లు.