Munugode Bypoll : ష్..గప్ చుప్.. మూగబోయిన మునుగోడు.. ఎన్నికల ప్రచారానికి ఎండ్ కార్డ్

మునుగోడులో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. నియోజకవర్గంలో మైకులు మూగబోయాయి. రోడ్ షోలు, సభలు, సమావేశాలతో గత నెల రోజులుగా హోరాహోరిగా సాగిన క్యాంపెయిన్ కు ఎండ్ కార్డ్ పడింది.

Munugode Bypoll : ష్..గప్ చుప్.. మూగబోయిన మునుగోడు.. ఎన్నికల ప్రచారానికి ఎండ్ కార్డ్

Munugode Bypoll : మునుగోడు మూగబోయింది. మునుగోడులో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. నియోజకవర్గంలో మైకులు మూగబోయాయి. రోడ్ షోలు, సభలు, సమావేశాలతో గత నెల రోజులుగా హోరాహోరిగా సాగిన క్యాంపెయిన్ కు ఎండ్ కార్డ్ పడింది. క్యాంపెయిన్ ముగియడంతో ప్రలోభాలకు తెరలేపే అవకాశం ఉందంటూ ఈసీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. మద్యం, డబ్బు పంపిణీ ఇతర ప్రలోభాలను అరికట్టేందుకు ఈసీ 50 ఫ్లయింగ్ స్వ్కాడ్స్ ను నియమించింది. మునుగోడులో వంద చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. 3వేల 366 మంది పోలీసులతో పాటు 15 ప్రత్యేక దళాలు మోహరించారు.

మరోవైపు ఎల్లుండి(నవంబర్ 3) పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. 1,192 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. 298 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 2లక్షల 41వేల 855మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

కొన్ని రోజులుగా మునుగోడు నియోజకవర్గంలో జరిగిన ప్రచార పర్వం ముగిసింది. ప్రధాన పార్టీలన్నీ హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ప్రచారం సమయం ముగిసింది. దీంతో ఇన్ని రోజులుగా మైకులు, డీజే సౌండ్ లు, బహిరంగ సభలు, రోడ్ షోలు, బైక్ ర్యాలీలతో హోరెత్తిన మునుగోడు నియోజకవర్గం.. ఇప్పుడు అవి బంద్ కావడంతో సైలెంట్ గా మారింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఇతర ప్రాంతాల నుంచి మునుగోడుకి వచ్చిన నేతలంతా తిరుగు పయనం అయ్యారు. నవంబర్ 3న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

ఈ ఉపఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికార టీఆర్ఎస్.. గెలుపే లక్ష్యంగా గ్రామానికి ఓ ఎమ్మెల్యేను నియమించి ప్రచారం చేసింది. బీజేపీ, కాంగ్రెస్ లు సైతం తగ్గేదేలే అన్నట్టుగా ప్రచారం చేశాయి.