Bhupal Reddy : 30 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని నల్గొండ.. కేసీఆర్, కేటీఆర్ సహకారంతో రూపురేఖలు మారిపోయాయి : ఎమ్మెల్యే కంచర్ల
జిల్లా కేంద్రంలో కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారని తెలిపారు. నల్గొండ వంటి ప్రాంతానికి ఐటీ హబ్ తీసుకవచ్చిన ఘనత మంత్రి కేటీఆర్ దేనని చెప్పారు.

MLA Kancharla Bhupal Reddy
MLA Kancharla Bhupal Reddy : 30 ఏళ్లుగా నల్గొండ జిల్లా కేంద్రం గోస పడిందని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పేర్కొన్నారు. మాములు పట్టణాల్లో ఉన్న అభివృద్ధికి కూడా నల్గొండ నోచుకోలేదన్నారు. సీఎం కేసీఆర్, కేటీఆర్ సహకారంతో నల్గొండ రూపురేఖలు మారిపోయాయని తెలిపారు. గత ఎన్నికల్లో ప్రజలు తెలివైన నిర్ణయం తీసుకోవడంతో ఇవాళ నల్గొండ పునర్నిర్మాణం జరుగుతోందని చెప్పారు. ఎన్నడూ లేని అభివృద్ధిని జిల్లా కేంద్ర వాసులు చూస్తున్నారని వెల్లడించారు.
రాజకీయ నాయకులు 30 ఏళ్లుగా మాటలు చెప్పారు తప్పితే చేతలు లేవని విమర్శించారు. సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ సహకారంతో నల్గొండ రూపురేఖలు మారిపోయాయని తెలిపారు. జిల్లా వాసుల కలగా మిగిలిన ఐటీ హబ్ ను సోమవారం కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం చేసుకోబోతున్నామని పేర్కొన్నారు. జిల్లా కేంద్రానికి ఐటీ హబ్ తలమానికంగా నిలవనుందన్నారు.
జిల్లా కేంద్రంలో కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారని తెలిపారు. నల్గొండ వంటి ప్రాంతానికి ఐటీ హబ్ తీసుకవచ్చిన ఘనత మంత్రి కేటీఆర్ దేనని చెప్పారు. సోమవారం మంత్రి కేటీఆర్ కు ఘనస్వాగతం పలకాలన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు ప్రజలు బహిరంగ సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు.