Hyderabad or Bhagyanagar: హైదరాబాద్… భాగ్య నగరం అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు: ఏఎస్ఐ

హైదరాబాద్ పేరు విషయంలో కొంతకాలంగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నగరం పేరు గతంలో భాగ్య నగర్‌గా ఉండేదని కొందరు వాదిస్తూ ఉంటారు. దీని పేరు తిరిగి భాగ్య నగర్‌గా మార్చాలని డిమాండ్ చేస్తుంటారు. అయితే, దీనిపై ఏఎస్ఐ స్పష్టతనిచ్చింది.

Hyderabad or Bhagyanagar: హైదరాబాద్… భాగ్య నగరం అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు: ఏఎస్ఐ

Hyderabad or Bhagyanagar: హైదరాబాద్ పేరు విషయంలో కొంతకాలంగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ పేరును భాగ్య నగరంగా మార్చాలని బీజేపీకి చెందిన నేతలతోపాటు పలు సంఘాల నేతలు డిమాండ్ చేస్తుంటారు. గతంలో హైదరాబాద్ పేరు భాగ్య నగరంగానే ఉండేదని చెబుతుంటారు.

Teacher Arrested: ట్యూషన్‌లో బాలికకు వోడ్కా తాగించిన టీచర్.. స్పృహ కోల్పోయిన విద్యార్థిని

అయితే, దీనిపై భారతీయ పురాతత్వ శాఖ (ఏఎస్ఐ) స్పష్టతనిచ్చింది. హైదరాబాద్.. భాగ్య నగర్ అనేందుకు తగిన చారిత్రక ఆధారాలు, నేపథ్యం లేవని స్పష్టం చేసింది. అలాగే చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి దేవాలయానికి సంబంధించిన చారిత్రక ఆధారాలు కూడా లేవని ఏఎస్ఐ చెప్పింది. రాబిన్ అనే వ్యక్తి దాఖలు చేసిన సమాచార హక్కు చట్టం దరఖాస్తు ద్వారా ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ సమాచారం ప్రకారం.. హైదరాబాద్ నగరానికి ఆ పేరు తప్ప భాగ్య నగర్ లేదా మరో పేరేదీ గతంలో లేదు. భాగమతి లేదా భాగ్యనగర్‌కు సంబంధించి కూడా ఎలాంటి మినీయేచర్ లేదు. అలాగే ఈ పేర్లతో ఎలాంటి కాయిన్ కూడా విడుదల కాలేదు.

Karnataka Horror: నాలుగేళ్ల కూతురును నాలుగో అంతస్థు నుంచి పడేసి చంపిన తల్లి.. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యం

గతంలో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్.. హైదరాబాద్ పేరు మార్చేందుకు ప్రయత్నించినట్లు ఎలాంటి ఆధారం లేదు. చార్మినార్ దగ్గర భాగ్యలక్ష్మి దేవాలయం ఉన్నట్లు కూడా ఆధారాలు లేవు. ఈ దేవాలయాన్ని 1960లో అక్రమంగా నిర్మించినట్లు తెలుస్తోంది. అలాగే హిందూ దేవాలయాలు ఉన్నప్రాంతంలో మసీదులు కట్టినట్లు కూడా ఎలాంటి ఆధారాలు లేవని ఏఎస్ఐ వెల్లడించిన వివరాల ఆధారంగా తెలుస్తోంది.